రాజకీయాల్లో కూడా రకరకాల సెంటిమెంట్స్ పాటిస్తూ ఉంటారు. సాధారణంగా నాయకులను ఎన్నుకునేది ప్రజలే అయినా, కానీ  కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుపోటమిని బట్టి  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏంటి అనేది చెబుతూ ఉంటారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక సెంటిమెంటు  నియోజకవర్గము ఉన్నది అది ఏంటయ్యా అంటే.. రాజమండ్రి. ఇక్కడ గెలిచే ఓడిపోయే అభ్యర్థులను బట్టి పార్టీలు అధికారంలోకి రావడం, రాకపోవడం అనేది  జరుగుతుందనే సెంటిమెంటు ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అక్కడ టిడిపి పార్టీ అభ్యర్థికి సెంటిమెంట్ టెన్షన్ పట్టుకుందట.  ఆయన ఆ స్థానంలో గెలిస్తే టిడిపి అధికారంలోకి రాదని, ఆయన ఓడిపోతే అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు.

 రాజమండ్రి సిటీ రాజకీయాల్లో ఆదిరెడ్డి కుటుంబీకులు   కీలక రాజకీయ నాయకులుగా ఉన్నారు.ఈ ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు టిడిపి తరఫున పోటీ చేశారు. ఇప్పటివరకు ఈ ఫ్యామిలీలో ఎవరు గెలిచినా ప్రతిపక్షంలోనే ఉన్నారట. ఇదే రాజమండ్రి పొలిటికల్ సెంటిమెంట్ గా మారింది. దాని ప్రకారం చూస్తే వాసు ఎమ్మెల్యేగా గెలిస్తే పార్టీ పవర్ లోకి రాదనే భయం కూడా పట్టుకుందట. 2009లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ గా ఆదిరెడ్డి వీరరాఘవమ్మ ఎన్నికయ్యారు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆదిరెడ్డి కుటుంబం అంతా వైసిపిలోకి మారింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిరెడ్డి అప్పారావు టిడిపిలో చేరిపోయారు. ఇక 2019లో అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవాని విజయం సాధించారు. దీంతో టిడిపి పవర్ పోయి వైసిపి అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకు ఆదిరెడ్డి కుటుంబీకులు ఏదో ఒక రాజకీయ పదవి పొందుతూ వచ్చారు. భవాని భర్త ఆదిరెడ్డి వాసు.

 ఈయన ఈసారి ఎంతో కష్టపడి టిడిపి నుంచి టికెట్ తెచ్చుకున్నారు. కానీ అక్కడ టిడిపి వైసిపి మధ్య హోరాహోరి పోటీ ఉందట. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి వాసు గెలుస్తారా ఓడుతారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఆయన ఎమ్మెల్యే అయితే రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాదని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారట. గత ఐదు సంవత్సరాలుగా ఆదిరెడ్డి భవాని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటం వల్ల  పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనే టాక్ కూడా అక్కడ ఉంది. ఒకవేళ వాసు గెలిచినా మళ్లీ అదే పరిస్థితి వస్తుందనే అపోహ కూడా ప్రజల్లో ఉన్నదని తెలుస్తోంది. ఒకవేళ ఆదిరెడ్డి గెలిస్తే మాత్రం టిడిపి అధికారంలోకి రాదు అనే సెంటిమెంటు నెలకొని ఉంది. ఈసారి ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా లేదంటే, మునుపటిలాగే కొనసాగుతుందా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: