వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పులివెందుల చరిత్రలో వైఎస్ రాజారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దివంగత వైఎస్ రాజారెడ్డి కరువు పరిస్థితులలో ప్రజలకు అండగా నిలిచారు. 1925 సంవత్సరంలో జన్మించిన రాజారెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేవారిగా పేరు సొంతం చేసుకున్నారు.
 
తన దగ్గరకు వచ్చిన ఎలాంటి సమస్యనైనా ఆయన పరిష్కరించేవారు. పులివెందుల సర్పంచ్ గా ఆయన పొలిటికల్ కెరీర్ మొదలైంది. 1988 సంవత్సరం నుంచి 1995 వరకు పులివెందుల సర్పంచ్ గా పని చేసిన రాజారెడ్డి పులివెందుల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తూనే ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్లకు అండగా నిలబడేవారు. పులివెందులలో నీటి సమస్యలను సైతం ఎంతో కష్టపడి ఆయన పరిష్కరించారు.
 
పులివెందులలో వైఎస్ రాజారెడ్డి పేరుతో ప్రత్యేకంగా కాలనీలు ఉన్నాయి. వైఎస్ రాజారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సీఎంగా చూడాలని తపించేవారని ఆయనను దగ్గరనుంచి చూసిన వాళ్లు చెబుతారు. వైఎస్ రాజారెడ్డి పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజ్ లను నెలకొల్పారు. వైఎస్ రాజారెడ్ది మరణించి ఈ నెల 23వ తేదీకి 26 సంవత్సరాలు అయింది.
 
నిన్న వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత వైఎస్ కుటుంబీకులు జీసెస్ చారిటీస్ లో ఉన్న చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందుకోసం స్థానికంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్ రాజారెడ్డి పులివెందులలో 70 పడకల ఆస్పత్రిని నిర్మించారు. ఆ ఆస్పత్రిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూపాయికే వైద్యం అందించేవారు. 1998 సంవత్సరంలో ప్రత్యర్థి ముఠా జరిపిన బాంబు దాడిలో వైఎస్ రాజారెడ్డి మరణించారు. వైఎస్ రాజారెడ్డి భౌతికంగా మరణించినా ప్రజల హృదయాల్లో మాత్రం జీవించే ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: