ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో... తెలుగుదేశం పార్టీ అగ్రనేతలను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి చాలా స్కెచ్ లు వేశారు. చంద్రబాబు నాయుడు, బాలయ్య, నారా లోకేష్, అచ్చెన్నాయుడు ఇటు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాంటి కీలక నేతలను ఓడించేందుకు బలమైన నాయకులను బరిలోకి దించడమే కాకుండా... చాలా ఖర్చు కూడా చేశారట జగన్. ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలలో... ఈ అగ్ర నేతలు ఉన్న నియోజకవర్గాలలో... కోట్లల్లో సంక్షేమ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగానే టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ను ఓడించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేశారు. 2019 నుంచి 2023 వరకు టెక్కలి నియోజకవర్గం లో చాలా సంక్షేమ పథకాలను అలాగే సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చారు జగన్. ఇక ఈ 2024 ఎన్నికల్లో కింజారపు అచ్చెన్నాయుడు ను ఓడించేందుకు ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాసును బరిలో దింపారు జగన్మోహన్ రెడ్డి.

అచ్చెన్నాయుడు ను ఓడించేందుకు ముందు నుంచి ప్లాన్ చేసిన జగన్... ఇప్పుడు బోల్తా పడ్డారట. టెక్కలి నియోజకవర్గంలో కాళింగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 50% ఉన్నారు. వెలమ 20%, వైశ్య 10, ఇతర సామాజిక వర్గాలు మొత్తం 20% ఓట్లు ఉంటాయి. అయితే ఇక్కడ కాలింగ సామాజిక వర్గానికి చెందిన వాడే దువ్వాడ శ్రీనివాస్. దీంతో అక్కడ ఈజీగా గెలుస్తామని వైసిపి భావించింది. కానీ పోలింగ్ కంటే ఒకరోజు ముందు సీన్ మారిందట.  అంతేకాదు దువ్వాడ ఎలాగైనా గెలవాలని... టెక్కలి నియోజకవర్గంలో 700 కోట్లతో మూలపేటలో వేగంగా పోర్టు పనులు కూడా వైసిపి చేసింది. అయితే ఈ పోర్టు పనుల నేపథ్యంలో మూలపేట, విష్ణు చక్రం లబ్ధిదారులకు పరిహారం కూడా అందలేదట.

దీంతో అక్కడ ఉన్న ఓటర్లు వైసిపికి ఓటు వేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే వైసిపి పార్టీలో ఉన్న కిల్లి కృపారానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా దువ్వాడ చేశారట. దీంతో ఆమె ఎన్నికల కంటే ముందే వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలా కూడా టెక్కలి నియోజకవర్గంలో వైసిపి పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెబుతున్నారు. ఇటు ఏపీ వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీయటం కూడా ఒక కారణం అని చెబుతున్నారు. మొత్తానికి ఈసారి కూడా అచ్చెన్నాయుడు విజయాన్ని వైసిపి అడ్డుకోలేదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: