- క‌లివిడి క‌లెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా గుర్తింపు
- అంబేద్క‌ర్ విగ్ర‌హ నిర్మాణంలో కీ రోల్‌
- బెజ‌వాడ బెంజ్ స‌ర్కిల్ నిర్మాణంలోనూ గుర్తింపు

( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశాలు పాటించే క‌లెక్ట‌ర్ల‌లో ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ తీరు వేరు. ఆయ‌న క‌లివిడి క‌లెక్ట ర్ల‌లో ముందుంటారు. నిత్యం సీఎంవోకు అనుసంధానంతో ఉండే క‌లెక్ట‌ర్ల‌లో ఇక్క‌డి జిల్లా క‌లెక్ట‌ర్ ఢిల్లీ రావు తీరే వేరు. దీనికి ప్ర‌దాన కార‌ణం.. సీఎం జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈయ‌న‌కు ప్ర‌మోష‌న్ ఇవ్వ‌డంతో పాటు కీల‌క‌మైన ఎన్టీఆర్ జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో జ‌గ‌న్ అంటే.. ఈయ‌న‌కు విధేయత‌ ఎక్కువ‌గానే ఉంద‌ని చెప్పాలి.


విజ‌య‌వాడ న‌డిబొడ్డున రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌పంచ స్థాయిలో ఏర్పాటు చేయాల‌ని భావించిన‌ప్పుడు.. అహ‌ర్నిశ‌లూ క‌లెక్ట‌ర్ ఢిల్లీరావు శ్ర‌మించారు. ఇది సీఎం జ‌గ‌న్కు మ‌రింత న‌చ్చింది. అంతేకాదు.. యుద్ద‌ప్రాతిప‌దిక‌న దీని నిర్మాణాన్ని ఆయ‌న పూర్తి చేయించారు. ఎక్క‌డా రూపాయి అవినీతి జ‌ర‌గ‌కుండా.. సీఎం జ‌గ‌న్ అనున్న‌ది అనుకున్న‌ట్టు గా చేయ‌డంలోనూ ఆయ‌న స‌క్సెస్ అయ్యారు.


అదే విధంగా విజ‌య‌వాడ బెంజ్ సర్కిల్ నిర్మాణం పూర్తి చేయ‌డంలోనూ క‌లెక్ట‌ర్‌గా ఆయ‌న మెప్పు పొందా రు. ఇక‌, స్తానిక ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు నిరంతరం  అందుబాటులో ఉన్న అధికారిగా కూడా పేరు తెచ్చుకు న్నారు ఎక్కువ‌గా.. వివాదాల జోలికి పోకుండా అంద‌రినీ క‌లుపుకొని పోవడంలో ఢిల్లీ రావు స్పెషల్‌గా గుర్తింపు పొందారు. ఒక్క ప్ర‌జాప్ర‌తినిదులు మాత్ర‌మే కాకుండా.. ఇత‌రుల ను కూడా క‌లుపుకొని పోయేవారు.


అదేవిధంగా మీడియాతో నూ ఆయ‌న క‌లివిడిగా ఉన్నార‌నడంలో సందేహంలో లేదు. స‌హ‌జంగా.. క‌లెక్ట‌ర్లు.. మీడియా మిత్రుల‌కు పీఏలు.. లేదా కార్యాల‌య పోన్ నెంబ‌ర్లు మాత్ర‌మే ఇస్తారు. కానీ, ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం.. మీడియాకు నేరుగా త‌న ఫోన్ నెంబ‌రు ఇవ్బ‌డంలోనూ.. వారి స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్క‌రించ‌డంలోనూ ... ఢిల్లీ రావు ముందున్నారు. ఎక్క‌డా విమ‌ర్శ‌లు రాకుండా కూడా చూసుకుని.. సీఎం జ‌గ‌న్‌తో అనేక సంద‌ర్బాల్లో ప్ర‌శంస‌లు పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: