- ఏపీలో రైతుకు, జ‌గ‌న్‌కు అవినాభావ బంధంలో ద్వివేది కీ రోల్‌
- రైతుల కేంద్రంగా జ‌గ‌న్ పాల‌న మార్చిన ఘ‌న‌త ఆయ‌న‌దే..
- రైతు భ‌రోసా కేంద్రాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క పాత్ర‌

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

రాష్ట్రంలో రైతుల‌కు - జ‌గ‌న్‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఎంతో అంద‌రికీ తెలిసిందే. మేనిఫెస్టోలో పేర్కొన్న‌ది కేవ‌లం.. రైతు భ‌రోసా మాత్ర‌మే. ఇది ఇచ్చేసి.. చేతులు దులుపుకొనే ప‌రిస్థితి ఉంది. కానీ, అలా చేయ‌డం లేదు. రైతు భ‌రోసా కేంద్రాలు.. కిసాన్‌ప‌నిముట్లు.. వంటివాటిని కూడా రైతుల‌కు అందిస్తు న్నారు. త‌ద్వారా... రైతుల విష‌యంలో గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌న్నా కూడా.. ఎక్కువ‌గా ప్ర‌స్తుత సీఎం కృషి చేస్తున్నారనే పేరు వచ్చింది.


అయితే.. ఇలా రైతుల‌కు సీఎం జ‌గ‌న్‌ను చేరువ చేసిన ఏకైక ఐఏఎస్ అధికారి గోపాల కృష్ణ ద్వివేదీ. వ్య‌వ సాయ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా వ్య‌వ‌హ‌రిస్తున్న ద్వివేదీ.. సీఎం జ‌గ‌న్ మ‌న‌సును ఆక‌ట్టుకున్నారు. రైతు ల స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డంలోనూ.. రైతుల‌కు అందుబాటులో ఉండేలా.. జిల్లా యంత్రాంగాల‌ను న‌డి పించ‌డంలోనూ... ఆయ‌న‌ది అందెవేసిన చేయి. ఆయ‌న ఆలోచ‌న‌ల నుంచే.. రైతు భ‌రోసా కేంద్రాలు వ‌చ్చాయి. ఆయ‌న సూచ‌న‌ల మేర‌కే ఈ పేరును పెట్టార‌ని అంటారు.


అంతేకాదు.. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లోనూ కూడా.. రైతుల‌ను ఆయ‌న క‌లుస్తుంటారు. స‌మ‌స్య‌లు వింటారు. కానీ, ఎక్క‌డా ప్ర‌చారం చేసుకోరు. రైతుల‌కు అవ‌స‌రమైన పురుగు మందులు, విత్త‌నాల‌ను కూడా స‌కాలంలో అందించ‌డంలోనూ ముందున్నారు. మొత్తంగా.. చూస్తే. సీఎం జ‌గ‌న్ ఎలా అయితే.. రైతుల కేంద్రంగా త‌న పాల‌న ఉండాల‌ని ఆశించారో.. అచ్చంగా అలానే చేసిన అధికారి గోపాల‌కృష్ణ ద్వివేదీ. నిజానికి సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత‌.. ఈ శాఖ‌ను ఎవ‌రికి అప్ప‌గించాల‌నే చ‌ర్చ వ‌చ్చింది.


ఆ స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా ప్ర‌తిపాదించిన పేరు.. గోపాల కృష్ణ ద్వివేదీ. గ‌తంలో 2019 ఎన్నిక‌ల సమ‌యంలో ఆయ‌న రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో నిష్ఫక్ష‌పాతంగా ఎన్నిక‌లు నిర్వ‌హించార‌నే పేరు కూడా తెచ్చుకున్నారు. దీంతో సీఎం జ‌గ‌న్ త‌న మాన‌స పుత్రిక అయిన వ్య‌వ‌సాయరంగాన్ని ఆయ‌న చేతిలో పెట్టారు. సీఎం జ‌గ‌న్ అంచ‌నాల‌కు అనుగుణంగానే ద్వివేదీ కూడా.. పేరు తెచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: