- ఏపీలో 31 ల‌క్ష‌ల మందికి ఇళ్ల ప‌ట్టాల‌తో జ‌గ‌న్ రికార్డ్‌
- టార్గెట్ ఫుల్‌ఫిల్ చేయ‌డంలో అజ‌య్ జైన్ కృషి

( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )

సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి అజ‌య్ జైన్‌. ఈయ‌న ప‌నితీరు మ‌న‌కు పెద్ద‌గా ప్ర‌చారంలో ఉండ‌దు. కానీ, ఆయ‌న చేసిన ప‌ని కార‌ణంగానే.. సీఎం జ‌గ‌న్ మేనిఫెస్టోలో పెట్టి.. అమ‌లు చేసిన‌.. న‌వ‌ర‌త్నాలు-పేద‌లం ద‌రికీ ఇళ్లు ప‌థ‌కం.. వ‌డివ‌డిగా అడుగులు వేసింది. ఒకానొక ద‌శ‌లో ప‌రుగులు కూడా పెట్టింది. దీనికి కార ణం..అజ‌య్ జైన్ స‌మ‌య స్ఫూర్తి.. వివాద ర‌హిత అధికారిగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు. దీంతో దాదాపు ల‌బ్ధిదారులు అంద‌రికీఇళ్లు ద‌క్కాయి.


రాష్ట్రంలో 31 ల‌క్ష‌ల మందికి సీఎం జ‌గ‌న్ ఇళ్ల ప‌ట్టాలు అందించారు. అయితే.. ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల‌ను ఇవ్వ‌డం. అది కూడా స్థ‌లాలు ఇచ్చి.. క‌ట్టించి ఇవ్వ‌డం అంటే మాట‌ల‌తో అయ్యే ప‌నికాదు. అయినా.. అజ‌య్ జైన్‌పై ఉన్న న‌మ్మ‌కంతో స‌మ‌యం పెట్టి మ‌రీ.. సీఎం జగ‌న్ ఈప‌థ‌కాన్ని అమ‌లు చేశారు. 2022 జ‌న‌వ‌రి నెల సంక్రాంతికి ఇళ్ల ప‌ట్టాలు ఇస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్ అన్న‌ది అన్న‌ట్టుగా చేశారు. దీనివెనుక అజ‌య్ జైన్ కృషి ఎంతో ఉంద‌ని చెప్పాలి.


ఒకానొక ద‌శ‌లో కొన్ని జిల్లాల్లో భూముల స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. ప్ర‌భుత్వ భూములు లేవ‌ని అధికారులు స‌మాచారం ఇచ్చారు ఇలాంటి జిల్లాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన జైన్‌.. అక్క‌డ కూడా.. స‌మ‌స్య‌లు రాని భూముల‌ను సేక‌రించారు. ఇక‌, ఇత‌రుల నుంచి కొనుగోలు చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు కూడా.. స‌ర‌స‌మైన ధ‌ర‌లు పొందేలా వారిని ఒప్పించి.. ప్ర‌భుత్వ ఖ‌జానాను కాపాడారు. ల‌బ్దిదారుల ఎంపిక విష‌యంలో రాజ‌కీయాలు ప‌క్క‌న పెట్టి.. నిజ‌మైన వారికి ప‌ట్టాలు ద‌క్కేలా చేశారు.


ఇలా.. సీఎం జ‌గ‌న్ కీల‌క‌మైన ప‌థ‌కంగా భావించిన ఇళ్ల ప‌ట్టాల పంపిణీ విష‌యంలో తెర‌చాటు అజ‌య్ జైన్ అలుపెరుగ‌ని క‌ష్ట‌మే ప‌డ్డారు. అమ‌రావ‌తి రాజ‌ధానిలో పేద‌ల‌కు ఇళ్లు ఇవ్వాల‌న్న‌ప్పుడుకూడా.. జోన్‌ల‌ను అధ్య‌య‌నం చేసివాటిని కోర్టుల్లోఎదుర్కొని.. మ‌రీ ఇక్క‌డ ఇళ్లు ఇచ్చేలా.. జైన్ కృషిచేశారు. ఇంత క‌ష్ట‌ప‌డినా..ఆయ‌న ఎక్క‌డా పేరు కోరుకోలేదు. అంతా జ‌గ‌న్ ఆశీస్సులేన‌ని నిర్మొహ‌మాటంగా చెబుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: