ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అందరూ మాచర్ల నియోజకవర్గంలో జరిగిన సంఘటనల గురించే మాట్లాడుకుంటున్నారు. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే ఈ ఎన్నికల రోజున... తెలుగుదేశం వర్సెస్ వైసిపి నేతల మధ్య గొడవలు జరిగాయి. అయితే మాచర్ల నియోజకవర్గంలో ఈ గొడవలు కాస్త ఎక్కువైనట్లు సమాచారం. దీంతో రెండు పార్టీలు కూడా రింగింగ్కు పాల్పడినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఇలాంటి నేపథ్యంలో... మాచర్ల నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో చొరబడిన  స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... అక్కడ ఉన్న ఈవీఎం బాక్స్లను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... భారీ ఊరట పొందారు.

జూన్ 5వ తేదీ వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకూడదని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలకు ఊహించని షాక్ తగిలినట్లు అయింది. అయితే తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో పై తెలుగుదేశం పార్టీ కీలక నేత బుద్ధ వెంకన్న స్పందించారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని షూట్ చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బుద్ధ వెంకన్న.

మాచర్ల మున్సిపాలిటీ చైర్మన్ పదవికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేలంపాట కూడా పాడారని ఫైర్ అయ్యారు. ఓటమి ఖాయమని డిసైడ్ అయిన కొంతమంది వైసిపి నేతలు విదేశాలకు వెళ్లిపోయారని ఆరోపణలు చేశారు. వాళ్లు కౌంటింగ్ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ కు రారని... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు  రెడ్ బుక్ లో ఉందని ఫైర్ అయ్యారు బుద్ధ వెంకన్న. ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోతుందని... తెలుగుదేశం కూటమీకి 130 స్థానాలు వస్తాయని వివరించారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేస్తారని కూడా బుద్ధ వెంకన్న తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: