ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు జరిగి ఇప్పటికి 11 రోజులు కాబోతోంది.. అలా ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల తరువాత బాగా సమీక్షించి ఐప్యాక్ సమావేశంలో తమ పార్టీకి 151 యొక్క సీట్లు వస్తాయని తెలియజేశారు. దీంతో ఆ తర్వాత విదేశాలలో కాస్త విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు జగన్. ఆ తర్వాత చంద్రబాబు మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతి పేపర్ రాసిన మేరకు 120 నుంచి 130 యొక్క సీట్లు వస్తాయని వారి యొక్క సమక్షంలో తేలిందని రెండు రోజుల తర్వాత రాసింది.


ఇలా ఓవరాల్ గా ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అంటూ ఒక సీరియస్ ప్రచారం అయితే టిడిపి పార్టీ చేస్తోంది. బెట్టింగ్ వంటివి కూడా ఎక్కువగానే తెలుగుదేశం పార్టీ మీదే చేస్తోంది. దీంతో వైసిపి పార్టీ భయపడుతుందా.. అంటే వార్తలు వినిపిస్తున్న సమయంలో..కానీ వైయస్సార్సీపి కార్యకర్తలు మాత్రం ఏ మాత్రం భయపడలేదు అంటున్నారు నాయకులు.. నాయకులు కూడా ఏమాత్రం భయపడలేదని తెలుపుతున్నారు. పరిస్థితులను చూస్తూ ఉంటే మాకు అనుకూలంగా ఉన్నాయని.. గ్రౌండ్ లెవెల్ లో ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీ , బీసీలు కూడా వైసిపి పార్టీ వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది.



ఓసిలలో కూడా ప్రభుత్వం వల్ల ప్రయోజనాలు పొందిన వాళ్లు కొంతమంది అటు ఇటుగా వేసుకోచ్చారని నేతలు సైతం తెలియజేస్తున్నారు. 50 నుంచి 55% వరకు ఓటింగ్ తమకే ఉందని వైసిపి ప్రభుత్వం భావిస్తోంది. పోయేటువంటి వాటిలో ఎక్కువగా కాపు సామాజికం వర్గం ఓటు ఉంటుందని కూడా తెలిపారు. గతంలో వచ్చిన దాంట్లో కొంతమేరకు కోత ఉంటుందని భావిస్తున్నారు. అలాగే కాపు సామాజిక వర్గంలో మహిళలు సైతం వైసీపీ పార్టీకి ఓటు వేశారని నమ్ముతున్నామని తెలిపారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో కూడా మెజారిటీ ఓట్లు వైసిపికే పడ్డాయని తెలిపారు. అలాగే ఆర్యవైశ్యుల కు చేసిన మంచి పనుల వల్ల తమకే ఓటు పడి ఉంటుందని తెలుపుతున్నారు. అయితే ఈ అంచనాలు వాస్తవమా ఊహ జనకమ అనేది నాలుగో తారీఖు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: