- క‌లెక్ట‌ర్ విజ‌య‌రామ‌రాజంటే జ‌గ‌న్‌కు అంత ఇష్ట‌మా
- వైఎస్సార్ క‌డ‌ప క‌లెక్ట‌ర్‌గా జిల్లా అభివృద్ధిలో ముద్ర‌

( ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ )

స‌హ‌జంగా క‌లెక్ట‌ర్‌ను ఎవ‌రూ కూడా పేరు పెట్టి పిలిచే చ‌నువు ఉండ‌దు. ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి మంత్రు ల వ‌ర‌కు కూడా అంద‌రూ స‌ర్ అనే సంబోధిస్తారు. కానీ, వైఎస్సార్ జిల్లా అంటే.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఉన్న విజ‌య రామ‌రాజు విష‌యంలో మాత్రం దీనికి మిన‌హాయింపు ఉంటుంది. ముఖ్యమంత్రి నుంచి జిల్లాకు చెందిన మంత్రుల వ‌ర‌కు.. కీల‌క ప్ర‌జాప్ర‌తినిధుల వ‌ర‌కు కూడా అంద‌రూ ఆయ‌న‌ను రాజు గారు అనే సంబోధిస్తారు.


ఇక‌, ముఖ్య‌మంత్రి అయితే.. రాజు-రాజు.. అనే సంబోధిస్తారు. దీనికి కార‌ణం.. ఆయ‌న ఎప్పుడు తాను క‌లె క్ట‌ర్‌ని.. ఉన్న‌త స్థాయిలో ఉన్నాన‌ని.. భావించ‌క‌పోవ‌డ‌మే. తాను కేవ‌లం ఒక ఉద్యోగిగా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిం చేవారు. ఎవ‌రు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండ‌డం.. వివాదాల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా వ్య‌వహ‌రించ‌డం వంటివి క‌లెక్ట‌ర్ విజ‌య‌రామ‌రాజుకు ఎనలేని పేరు తెచ్చాయి. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌కు అమిత‌మైన అభిమానం ఏర్ప‌డేలా చేశాయి.


నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ఎవ‌రైనా వ‌స్తే.. వారు చెప్పింది విన‌డం.. క‌లెక్ట‌ర్ బాధ్య‌త‌. గ‌తంలో ఇది ఉండేది కాదు. అస‌లు ప్ర‌జాప్ర‌తినిధులు వ‌స్తే.. నిలబెట్టి మాట్లాడిన అధికారులు కూడా ఉన్నారు. కానీ, వైఎస్సార్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా రాజు మూడు సంవ‌త్స‌రాలుగా ప‌నిచేస్తున్నారు. ఇక్క‌డ ఆయ‌న‌కు స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు వ‌చ్చిన వారి నుంచి ఆయా స‌మ‌స్య‌ల‌ను విన‌డమే కాదు.. ఆయ‌నే స్వ‌యంగా నోట్ రాసుకుంటారు. ఆయా స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేస్తారు.


అంతేకాదు.. ఫ‌లానా స‌మ‌యానికి వీటిని పూర్తి చేద్దాం.. అని క‌లివిడిగా ఉంటారు. ఈ క్ర‌మంలో ఆయ‌న నేరుగా క్షేత్ర‌స్థాయికి వెళ్లిన సంద‌ర్బాలు కూడా ఉన్నాయి. ఎక్క‌డా తాను అధికారిని అని ఫీల్ అవ‌రు. అన్న‌మయ్య డ్యామ్ కూలిపోయిన‌ప్పుడు.. నిర్వాసితుల‌ను త‌ర‌లించేందుకు న‌డుం బిగించి.. ఒక రాత్రంతా కూడా.. బాధిత ప్రాంతంలోనే ఉన్నారు. ఇక‌, ఎన్నిక‌ల వేళ అత్యంత కీల‌క‌మైన ఈ జిల్లాలో ఆయ‌న‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు రాక‌పోవ‌డం.. రాజు ప‌నితీరుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: