రాయలసీమ ప్రాంతంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వాణిజ్య వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి ఈ  నియోజకవర్గంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయి. ఉద్యమాలకు కేంద్ర బిందువైనటువంటి ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో  ఈసారి పోరు చాలా రసవత్తరంగా సాగుతోంది. అది కూడా ఇద్దరు గురు శిష్యుల మధ్య పోటా పోటీ ఏర్పడింది. మరి అలాంటి ఈ రాజకీయ యుద్ధంలో విజయం సాధించేది ఎవరు.. పొద్దుటూరులో జెండా ఎగరవేసేది ఎవరు.. అనే వివరాలు చూద్దాం.. ఒకప్పుడు గురు శిష్యులుగా ఉన్న వీరు నేడు ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరదరాజులరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఆయన శిష్యుడిగా  సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి  ఉండేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కాలానుగుణంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ చతికిల పడింది. దీంతో వరదరాజుల రెడ్డికి కాస్త రాజకీయంగా గ్యాప్ వచ్చింది. 

ఇదే సమయంలో ఆయన శిష్యుడు శివ ప్రసాద్ రెడ్డి  ప్రొద్దుటూరులో మంచి లీడర్ గా పట్టు సాధించారు. అయితే ఇక్కడ వరదరాజుల రెడ్డి  ఈ నియోజకవర్గం నుంచి వరుసగా పొద్దుటూరులో ఐదు సార్లు గెలుపొందారు. కానీ 2014లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ 2019లో టిడిపి టికెట్ ఆయనకు దక్కలేదు. ఈ స్థానంలో మల్లెల లింగారెడ్డి అనే వ్యక్తికి టికెట్ కేటాయించారు. ఇక ఇదే తరుణంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 2014లో వైసీపీ తరఫున విజయం సాధించారు. ఇక 2019లో కూడా విజయం సాధించారు శివప్రసాద్ రెడ్డి. ఇలా పొద్దుటూరులో మంచి పట్టు సాధించిన శివ ప్రసాద్ రెడ్డి 2024 లో కూడా గెలవాలనే ప్రయత్నాలు అనేకం చేశారని చెప్పవచ్చు. ఇక ఎంతో అనుభవం ఉన్న వరదరాజులరెడ్డి వైసీపీ  అసమ్మతి నేతలను తన వైపు తిప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు. కానీ శివప్రసాద్ మాత్రం టిడిపికి సంబంధించిన అసమ్మతి నేతలను మొత్తం వైసీపీలో చేర్చుకున్నారు. ఈ విధంగా 2014లో గురుశిష్యుల మధ్య ఏర్పడిన పోరులో వరదరాజుల రెడ్డిపై శివప్రసాద్ రెడ్డి 12,945 మెజారిటీ సాధించారు.  ఇక 2019 ఎన్నికల్లో లింగారెడ్డి పై  45 వేలకు పైగా మెజారిటీ పెంచుకున్నారు. కానీ ఈసారి అంతకు మించి మెజారిటీ సాధిస్తాం అనే ధీమాతో ఉన్నారు.

ఇక్కడ చేనేత, వైశ్య ఓట్లు కీలకంగా ఉంటాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో చేనేత వర్గానికి చెందిన మహిళలకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇక వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓ నేతకు టిటిడి పాలకమండలి అవకాశం కల్పించారు. ఈ విధంగా చేనేత, వైశ్యుల వర్గాన్ని వైసీపీ వైపు పూర్తిగా తిప్పేసుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అనేక పథకాలు కూడా  శివప్రసాద్ రెడ్డికి కలిసి వచ్చేలా ఉన్నాయి. అలాగే శివప్రసాద్ రెడ్డి తన సొంత డబ్బుతో ఎన్నో సహాయ  కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.  గత పది సంవత్సరాల నుంచి వరదరాజుల రెడ్డి క్రియాశీలక రాజకీయాల్లో ఉండకపోవడం రాజమల్లుకు మరో కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు.  అంతేకాకుండా 2019 నుంచి టీడీపీ ఇన్చార్జిగా ఉన్నటువంటి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ వస్తుందని ఆశించారు. కానీ అనూహ్యంగా వరదరాజులరెడ్డి అక్కడికి రావడంతో ఆయన వర్గం సపోర్ట్ చేయడం లేదు. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటును మాత్రమే  వరదరాజుల రెడ్డి నమ్ముకున్నారని చెప్పవచ్చు.  ఈ విధంగా ఇద్దరు అభ్యర్థుల బలాబలాలు పరిశీలిస్తే మాత్రం శివ ప్రసాద్ రెడ్డికి తప్పకుండా విజయం వరిస్తుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: