దేశ రాజకీయాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా భిన్నంగా మారాయి.. ఏపీ ఎన్నికలు స్థానికత సామాజిక సమీకరణాలకు చాలా ప్రాధాన్యత వహిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కులాల వారీగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఫలితాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు.. సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఏ పార్టీ రాష్ట్రంలో అధికారం వస్తుందో ముందే అంచనాలతో సర్వేలు సైతం పలానా పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటిస్తూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు పలు సర్వేలు సైతం వైసీపీకి అనుకూలంగా రాగ మరికొన్ని కూటమికి అనుకూలంగా వచ్చాయి .


అయితే పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే విషయం పైన రాజకీయ నాయకులకు మాత్రం అసలు అంత చిక్కడం లేదట. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని విషయం పైన సరైన క్లారిటీ కూడా కనిపించడం లేదు. గతంలో మాదిరిగా సర్వే సంస్థలు కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అంచనాలు కూడా వేయలేని పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కనిపిస్తోంది. ఆంధ్రాలో ఉన్న కండిషన్స్ తెలంగాణ ఎన్నికలలో కూడా ఇదే నిబంధనలు ఉండడంతో పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఎగ్జిట్ పోల్స్ సర్వే పేరుతో కాకుండా కొన్ని అంచనాల పేరుతో తెలియజేస్తూ ఉన్నారు.


అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఫలితాలను మాత్రం వెల్లడించడానికి అన్నే సర్వేలు వెనకాడుతున్నాయి. ఇతర రాష్ట్రాలలోని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ లోని పార్టీలకు చాలా వ్యత్యాసం ఉంటుంది.వ్యక్తిగత కక్షలు రాజకీయదాడులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే సర్వే సంస్థలు కూడా కాస్త ఆలోచించి అడుగు వేస్తున్నారు. అంతేకాకుండా జనాల నాడి ఎటువైపు ఉందనే విషయం పైన కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితులలో సర్వే సంస్థలు ఉన్నట్లు కనిపిస్తోంది. వైసిపి పార్టీ మాత్రం 151 మించి స్థానాలు వస్తాయని ధీమాతో ఉన్నారు.. కూటమి అయితే టిడిపి జనసేన బిజెపి పార్టీలు మెజారిటీ సీట్లు వస్తాయని తెలుపుతున్నారు. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయి జూన్ 4 వరకు ఆగాల్సిందే.. మొదటిసారి సర్వేలకు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దడ పుట్టిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: