ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో చెప్పలేని పరిస్థితి ఉన్నా పులివెందులలో మాత్రం జగన్ మరోసారి ఊహించని స్థాయిలో మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. పులివెందులలో జగన్ ను ఓడించగలమని ఛాలెంజ్ ఎవరూ విసరడం లేదు. పోస్ట్ పోల్ సర్వేలలో సైతం జగన్ పులివెందులలో గెలవడం ఖాయమని వెల్లడైంది.
 
వైసీపీ అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకుందా? లేదా? అనే చర్చ సైతం ప్రజల్లో జరుగుతోందనే సంగతి తెలిసిందే. అయితే వైసీపీ గెలిచినా ఓడినా ఆ పార్టీకి పెద్దగా నష్టం అయితే లేదని ఏపీ ఓటర్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పులివెందుల జగన్ కు పోటీనిచ్చే నేత ఎప్పటికీ లేనట్టేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2019ను మించి మెజారిటీని జగన్ సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.
 
అయితే జగన్ సొంత జిల్లా కడపలో 2019 నాటి మ్యాజిక్ రిపీట్ కాదని తెలుస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలోని మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో కూటమి గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కడపలో జగన్ కు ఒకింత కంగారు పెట్టేలా తీర్పు రానుందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న కొంతమంది నేతలకు సైతం జగన్ టికెట్లు కేటాయించారు.
 
వివేకా హత్య కేసు కూడా జగన్ కు ఒకింత మైనస్ అయిందని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. వైసీపీ ఈ ఎన్నికల్లో కడపలో ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది. వైసీపీ గెలిచినా ఓడినా మేనిఫెస్టో కారణమవుతుందనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రజల తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా రానుందో మరో 9 రోజుల్లో తేలిపోనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఈ ఎన్నికల్లో అనుకూల ఫలితాలను సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు వైసీపీ నేతలను సైతం తెగ టెన్షన్ పెడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: