తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తగిలిన దెబ్బ... ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో జగన్మోహన్ రెడ్డికి తగలనుందా? అంటే అవును అంటున్నాయ్ తాజా లెక్కలు. మొన్న తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో... పది సంవత్సరాలు పాలన చేసిన గులాబీ పార్టీ దారుణంగా ఓడింది. అయితే పది సంవత్సరాల కాలంలో... గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అత్యంత దారుణాలకు పాల్పడ్డారు.

అయినప్పటికీ వారికే కేసీఆర్ టికెట్ ఇచ్చారు. కొన్ని సీట్లల్లో అభ్యర్థులను మార్చారు. అక్కడ మంచి ఫలితాలు పొందారు. చాలా చోట్ల పాత అభ్యర్థులను పెట్టడం వల్ల కెసిఆర్ కు ఓటమి ఎదురయింది. ఈ విషయాన్ని పసిగట్టిన జగన్మోహన్ రెడ్డి... ఏపీలో భారీ స్థాయిలో అభ్యర్థులను మార్చేశారు. కొత్త అభ్యర్థులను పెట్టి ముందుకు వెళ్లారు. అక్కడ అభ్యర్థులు కొత్త అయినప్పటికీ... నా ముఖం చూసి ఓటు వేయాలని జగన్మోహన్ రెడ్డి కోరారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే... అభ్యర్థులను మార్చారు సరే... దాదాపు 90 నుంచి 100 స్థానాలలో మళ్లీ పాత అభ్యర్థులనే కొనసాగించారు జగన్. అయితే ఈ స్థానాలలో వైసిపి పార్టీ ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందట. అసలు జగన్ అంటే చాలా అభిమానం చూపిస్తూనే... స్థానిక ఎమ్మెల్యేలను బండ బూతులు తిడుతున్నారట ఓటర్లు. ఇదే అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో జనాలు మాట్లాడుకుంటున్నారు.

ఇప్పుడు ఈ వ్యతిరేకతనే జగన్ మోహన్ రెడ్డికి ముప్పుగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఓకే కానీ..  స్థానిక ఎమ్మెల్యే మాత్రం వద్దని... చాలామంది తెలుగుదేశం అభ్యర్థులకు ఓటు వేశారట. జగన్మోహన్ రెడ్డి వేవ్ ఎంత ఉన్నా కూడా... స్థానిక ఎమ్మెల్యేలు కచ్చితంగా గెలవాలి. జనాలు ఓటు వేయాలి. ఒకవేళ స్థానిక ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంటే... వైసిపి పార్టీకి గడ్డు పరిస్థితులు ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: