ఒకప్పుడు కాంగ్రెస్ వేవ్ నడుస్తున్నా సమయంలో కూడా  సీనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టి కేవలం సంవత్సరంలోపే  కాంగ్రెస్ పార్టీకి ధీటుగా  అధికారంలోకి వచ్చారు. అలా కొన్ని టర్ములు కాంగ్రెస్ మరియు టిడిపి మధ్య హోరాహోరీ పోటీ ఉండేది. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి మరణించారో అప్పటినుంచి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ మానియా తగ్గింది. ఇంతలోనే జగన్ వైఎస్సార్సీపీ పార్టీ పెట్టడంతో  అక్కడ వైసిపి టిడిపి అనే రెండు పార్టీలు బలంగా తయారయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత టిడిపి అధికారంలోకి వస్తే, ఆ తర్వాత టర్ములో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో జగన్ ఎన్నో పథకాలు తీసుకువచ్చి  దాదాపు చాలామంది ప్రజలను అట్రాక్ట్ చేశారు. వార్ వన్ సైడ్ అనే విధంగా  టిడిపి చరిత్రలోనే ఎప్పుడు కూడా చూడని ఓటమిని చవి చూపించారు. 

ఆ తర్వాత ఐదు సంవత్సరాలు పాలించిన జగన్  ఈ ఎన్నికల్లో కూడా  ఒంటరిగానే పోటీ చేశారు. కానీ చంద్రబాబు మాత్రం బిజెపి, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.  మరి బిజెపి, జనసేన, టిడిపికి సపోర్ట్ చేసిందా.. టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థులకు సపోర్ట్ చేసిందా అనేది చాలా కీలకంగా మారింది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. జనసేన, టిడిపి, బిజెపి జట్టు కట్టాయి.  కానీ ఈ మూడు పార్టీల మధ్య సమన్వయం ఏ విధంగా సాగింది అనేది చాలా కీలకంగా మారింది. పార్టీ అగ్రనేతల విషయం అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరిలు చాలా క్లియర్ గా ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ పార్టీల కార్యకర్తలు కలిశారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జనసేన కి తెలుగుదేశం బిజెపి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి. బిజెపికి తెలుగుదేశం, జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి.

ఇక టిడిపికి జనసేన, బిజెపి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ విధంగా మూడు అంశాలపైనే ప్రస్తుతం కూటమి గెలుపు ఓటమి అనేది డిసైడ్ అయి ఉన్నాయి. ఈ కింది స్థాయి కార్యకర్తలు,నాయకులు ప్రతి ఒక్క ఓటర్ తో ఇంటరాక్ట్ అయి కలిసి వెళ్లారా లేదా అనేదే చాలా కీలకం. ముఖ్యంగా టిడిపి వాళ్లు జనసేన, బిజెపి కార్యకర్తలను ఆదరించారా లేదా.. జనసేన వాళ్లు తెలుగుదేశం బిజెపిని ఆదరించారా.. ఈ విధంగా ముగ్గురు పార్టీ కార్యకర్తలు,కిందిస్థాయి లీడర్ల సమన్వయం అనేది క్లియర్ గా కుదిరి ఉండి ఓట్లు పోల్ అయితే మాత్రం తప్పకుండా కూటమి పార్టీకి గెలిచే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇందులో ఏ మాత్రం బెడిసి కొట్టినా తప్పకుండా జగనే విజయం సాధిస్తారని వారు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: