మే 13 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో తెలుగు దేశం , జనసేన , భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే , వైసీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది. దానితో కూటమి గెలవబోతోంది అని కూటమి నాయకులు కార్యకర్తలు ఎంతో బలంగా చెబుతూ వస్తున్నారు. ఇకపోతే కొంత మంది రాజకీయ విశ్లేషకులు మాత్రం కూటమి భారీ సీట్లను గెలుపొందే అవకాశం ఉంది.

కాకపోతే రాష్ట్రంలో కొన్ని పద్ధతుల ప్రకారం ఓట్లు పడినట్లు అయితే వారు గెలిచే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ఆ పద్ధతులు ఏవి అంటే తెలుగు దేశం పార్టీ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఒక విధంగా చూసుకుంటే అంతే బలమైన ఓటు బ్యాంకు వైసీపీ కి కూడా ఉంది. కాకపోతే టీడీపీ ఈ సారి జనసేన , బీజేపీ లతో కలిసి పొత్తులో భాగంగా పోటీ చేసింది.

ఇక టీడీపీ పార్టీ అభ్యర్థి పోటీ చేసిన ప్రాంతంలో జనసేన మరియు బీజేపీ పార్టీలను అభిమానించే వ్యక్తులు కూడా టీడీపీ కాండిడేట్ కు ఓట్లు వేసినట్లు అయితే ఆ ప్రాంతంలో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. ఇక జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేసిన ప్రాంతంలో టీడీపీ మరియు బీజేపీ పార్టీలను అభిమానించే వ్యక్తులు జనసేన కాండిడేట్ కు ఓటు వేసినట్లు అయితే జనసేన పార్టీ అభ్యర్థులు చాలా వరకు గెలిచే అవకాశం ఉంటుంది.

అలాగే బీజేపీ పార్టీ అభ్యర్థులు ఎక్కడి నుండి అయితే పోటీ చేస్తున్నారో ఆ ప్రాంతంలో బీజేపీ అనుకూల వ్యక్తులతో పాటు టీడీపీ , జనసేన అనుకూల వ్యక్తులు కూడా ఓట్లు వేసినట్లు అయితే బీజేపీ కి కూడా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఈ మూడు పార్టీలను ఒకే పార్టీ గా భావించి ఎక్కువ శాతం ఓట్లు పడినట్లు అయితే కూటమి అధికారం లోకి వచ్చే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: