ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కులాల రాజకీయాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిసారి మా కులపోడు... మా కులపోడు అంటూ జనాలు విర్రవీగుతూ ఉంటారు. శత్రువైనా సరే తమ కులం వాడు అయితే... వాణి దగ్గరికి తీసుకుంటారు. ఈ తరుణంలో ఈసారి ఏపీ రాష్ట్ర రాజకీయాలలో కాపు ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. 2014 అలాగే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాపు ఓట్లు ఏపీ భవిష్యత్తును శాసించాయి. ఇక ఈసారి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... తెలుగుదేశం కూటమికి అధికారం తీసుకువచ్చింది కాపు ఓట్లు మాత్రమే. అప్పుడు జనసేన పార్టీ పోటీ చేయకుండా తెలుగుదేశం కూటమికి మద్దతు ఇచ్చింది. దీంతో 1%  తేడా ఓట్లతో వైసీపీపై విజయం సాధించింది తెలుగుదేశం. అప్పుడు బిజెపి అలాగే తెలుగుదేశం పార్టీలు అధికారాన్ని పంచుకున్నాయి.

ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల సమయానికి సీన్ మొత్తం మారిపోయింది. కాపు ఓట్లు చీలిపోయాయి. చాలావరకు అంటే 50 నుంచి 60% వరకు వైసిపి పార్టీకి ఈ కాపు ఓట్లు టర్న్ అయ్యాయి. ముద్రగడ వర్సెస్ చంద్రబాబు నాయుడు మధ్య గొడవలు, జనసేన పార్టీ సొంతంగా బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయడం వైసిపి పార్టీకి కలిసి వచ్చింది. దాంతో అప్పుడు వైసిపి ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ముద్రగడ కూడా ఇన్ డైరెక్ట్ గా వైసీపీకి సపోర్ట్ చేయడంతో... కాపు ఓట్లు వైసిపికి టర్న్ అయ్యాయి.

ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల విషయం చాలా డిఫరెంట్ గా ఉంది. ఈసారి బిజెపి, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏకమయ్యాయి. అటు వైసిపి పార్టీకి మద్దతు ఇవ్వడమే కాకుండా ఆ పార్టీలో చేరారు కాపు ఉద్యమనేత ముద్రగడ. దీంతో కాపు ఓట్లు ఎటువైపు పడతాయో అని సందేహం అందరూ లోను ఉంది. జనసేన తమవైపు ఉంది కాబట్టి కాపు ఓట్లు ఇటే పడతాయని కూటమి అంటోంది. కాపు నేస్తం, కాపు నేతలకు పదవులు ఇవ్వడం లాంటి కీలక నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. దీంతో కాపు ఓట్లు వైసిపికి పడతాయని ఈ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా 2024 ఎన్నికలను కాపు ఓట్లు శాసించనున్నాయి. ఈ ఓట్లు ఎటువైపు ఎక్కువ పడితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: