ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎన్నికల తంతు ముగిసింది. గత సంవత్సర కాలం నుంచి  ఉన్నటువంటి ఎన్నికల ఫీవర్ కు మే 13వ తేదీన  ఎండ్ కార్డు పడిందని చెప్పవచ్చు. అభ్యర్థులంతా పరీక్షలు రాశారు కానీ రిజల్ట్ మాత్రం జూన్ 4న తేలనుంది. ఇదే తరుణంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ  ఎన్నికల రిజల్ట్ పై చాలా ఆసక్తి నెలకొంది. ఓవైపు టీడీపీ కూటమి మరోవైపు వైసీపీ కూటమి గెలుపుపై ధీమాతోనే ఉన్నారు. ఈ క్రమంలోనే చాలా సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ రెండు పార్టీల వైపు సమానమైన రిజల్ట్ ను అందజేస్తున్నాయి. కానీ ఎవరు గెలుస్తారు అనేది బలంగా చెప్పలేకపోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని గట్టిగానే చెప్పారు. కానీ దీనిపై చంద్రబాబు ఇప్పటివరకు స్పందించలేదు. 

ఈ క్రమంలోనే  మొన్నటి ఎన్నికల్లో  చాలావరకు పోలింగ్ శాతం పెరిగింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు  వారి యొక్క ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. అయితే వీరందరి ఓట్లు ఓకేత్తు అయితే, గవర్నమెంట్ ఉద్యోగుల ఓట్లు మరో ఎత్తు. ఎన్నడూ లేని విధంగా ఈసారి  ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ని ఉపయోగించుకున్నారు. ఈసారి ఎన్ని ఓట్లు పోలయ్యాయి అవి ఎవరికి పేవర్ గా ఉండబోతున్నాయి అనే వివరాలు చూద్దాం. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రెట్టింపు స్థాయిలో పోలయ్యాయట. ఈసారి మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అధికారిక లెక్క బయటపెట్టింది ఎలక్షన్ కమిషన్.

4,97,718 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో దీంట్లో సగం పోలయ్యాయి. చాలామంది ఉద్యోగులు ఈసారి చాలా కసిగా ఓట్లు వేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లలో 70%  టిడిపికే పడుతాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఎనిమిది గంటలకు స్టార్ట్ అయినా కౌంటింగ్ లో మొదటి అర్థగంట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత అధికారులు అధికారికంగా లెక్కలు బయటపెడతారు. ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపులో 175 నియోజకవర్గాల్లో మొదటి గంట సేపు  టిడిపి అభ్యర్థులదే హవా కొనసాగుతుంది. ఆ తర్వాతే  ఈవీఎంలు లెక్కిస్తారు. అప్పుడే 175 నియోజకవర్గాల్లో ఎవరు లీడింగ్ లో ఉన్నారు ఎవరు వెనక్కి వెళ్తున్నారనేది అర్థమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం మొదటి రౌండ్ లెక్కింపులో తప్పక టిడిపి హవా కొనసాగుతుందని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత వైసిపి లేదంటే టిడిపి ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వారు లీడింగ్ లో ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: