ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందా? వైసీపీ అధికారంలోకి వస్తుందా? అనే ప్రశ్నకు ఆత్మసాక్షి సర్వేలో కూటమికి ఎదురుదెబ్బేనని తేలిపోయింది. ఆత్మసాక్షి ఎన్నిసార్లు సర్వే చేసినా ఫలితం మాత్రం మారకపోవడం గమనార్హం. ఏపీలో పోలింగ్ కు రెండు రోజుల ముందు సైతం ఆత్మసాక్షి తన సర్వే ఫలితాలను వెల్లడించడం గమనార్హం. సరిగ్గా 14 రోజుల క్రితం ఆత్మసాక్షి చివరి సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి.
 
ఆత్మసాక్షి మొత్తం 7సార్లు సర్వేలు చేసి ఆ సర్వేలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించింది.  ఏపీలో ఓటర్లు కులాల వారీగా విడిపోయి ఓటింగ్ లో పాల్గొన్నట్టు ఈ సర్వే చెబుతోంది. వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఏ పార్టీ విజయం సాధించనుందో తేల్చి చెప్పనున్నాయని ఆత్మసాక్షి చెబుతోంది. మేనిఫెస్టోలు కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ఆత్మసాక్షి వెల్లడిస్తోంది.
 
మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోవడం కూడా ఈ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆత్మసాక్షి చివరి సర్వే ప్రకారం 105 నుంచి 115 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. మిగతా స్థానాల్లో కూటమి గెలవనుంది. ఆత్మసాక్షి ఫలితాలు నిజమవుతాయో లేదో జూన్ 4వ తేదీన తేలిపోనుంది.
 
గతంలో చాలా సందర్భాల్లో ఆత్మసాక్షి సర్వే లెక్కలు నిజం కావడంతో ఈ ఎన్నికల్లో సైతం ఆత్మసాక్షి అంచనాలే నిజమవుతాయని చాలామంది చాలామంది భావిస్తున్నారు. చంద్రబాబు, జగన్ ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ సంస్థల నుంచి సర్వేల ఫలితాలను తెప్పించుకున్నారని ఫలితాల గురించి ఈ ఇద్దరు ప్రధాన నేతలకు క్లారిటీ ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ సైతం ఆత్మసాక్షి లెక్కలు నిజం కావాలని భావిస్తోంది. ఆత్మసాక్షి అంచనాలు నిజం అయితే ఈ సంస్థ క్రెడిబులిటీ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: