ఆంధ్ర రాజకీయాలన్ని ఒక్కసారిగా వేడెక్కేలా చేసిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత అయినా పరిస్థితులు ప్రశాంతంగా మారుతాయి అనుకుంటే.. ఇంకా ఆంధ్రలో ఎక్కడ చూసినా కూడా ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయ్. ఏకంగా ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై దాడులు చేసుకోవడం సంచలనంగానే మారిపోతుంది. దీంతో ఇక సాధారణ రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఎన్నికల కౌంటింగ్ రోజు పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని అధికారులు అందరూ కూడా భయపడిపోతున్నారు.


 ఇలాంటి సమయంలోనే అన్ని శాఖల్లో ఉన్న అధికారులు అందరూ కూడా ప్రస్తుతం కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే వైసిపి రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతుందని కొంతమంది అంచనా వేస్తుంటే.. ఈసారి కూటమికి ఏపీలో అధికారం పక్క అని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీంతో ఎవరితో ఎలా మెలగాలో తెలియక అధికారులు కన్ఫ్యూషన్ లో పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే జగన్ కోసం పనిచేసిన కొంతమంది అధికారులు చంద్రబాబుకు టచ్ లో కి వస్తున్నారని.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నవారి ఆలోచనలకు అనుకూలంగానే పనితీరు ఉంటుందని చెప్పకనే చెబుతున్నారంటూ.. ఒక ప్రచారం ఆంధ్ర రాజకీయాలలో ఊపందుకుంది.


 ఇంకోవైపు అటు జగన్ తో కూడా ర్యాపో మెయింటైన్ చేస్తున్నారట  ఇలా అటు ఇటు కాకుండా న్యూట్రల్ గా ఉంటూ ఇక ఎవరి ప్రభుత్వం వచ్చిన తాము ప్రభుత్వం కోసం పని చేస్తామని చెబుతున్నారట అధికారులు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఉద్రిక్తతలలో అటు పోలీసులపై దాడులు జరిగిన ఎక్కడ కేసులు పెట్టకపోవడం లాంటివి చేశారట. ఎందుకంటే ఏదైనా పార్టీ నేతలపై కేసు పెడితే ఇక అదే పార్టీ అధికారంలోకి వస్తే తమకు ఇబ్బందులు తప్పవు అని అనుకుంటున్నారట. ఇలా ఎన్నికల ఫలితాల వరకు కూడా న్యూట్రల్ గానే ఉండాలని అటు అధికారులు అనుకుంటున్నారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: