పగలు ప్రతీకారాలు  కేవలం ఫ్యాక్షన్ సినిమాల్లో మాత్రమే ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇక తెలుగు రాష్ట్రాల్లో రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి ప్రతీకారాలు ఉంటాయనీ.. ప్రత్యర్థుల ప్రాణం తీయడమే లక్ష్యంగా కొంతమంది రాక్షసత్వంతో ఆలోచిస్తారు అని ఇక వెలుగులోకి వచ్చే  కొన్ని నిజ జీవిత ఘటన ద్వారా అందరికీ అర్థమవుతుంది. అయితే మొన్నటికి మొన్న ఏపీలోని రాయలసీమలో మాత్రమే ఇలాంటి ఫ్యాక్షన్ ఉండేది అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఈ నెత్తుటి రాజకీయం తెలంగాణకు కూడా పాకిపోయింది.


 ప్రజలకు ఏదో చేయడానికి పదవులు చేపడుతున్నారు అనుకుంటే ఇక పదవుల కోసం ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధమవుతున్నారేమో అనే భావన అందరికీ కలిగే విధంగా ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇటీవలే కొల్లాపూర్ నియోజక వర్గంలో చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లెలో బిఆర్ఎస్ పార్టీ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురి కావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా తెలుస్తోంది. ఈ హత్యతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ నేతలే కావాలని శ్రీధర్ రెడ్డిని హత్య చేయించారంటూ గులాబీ పార్టీలోని కీలక నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు.


 అయితే ఇది మాత్రమే కాదు గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయి. కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుజ్జుల పరమేశ్వర్ 2023 నవంబర్ 29న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోజు రాత్రి హత్యయత్నం.. పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబ్బుగూడ సర్పంచ్ ఇందిరా, బి ఆర్ ఎస్ నాయకుడు రవినాయక్ తల్లిపై డిసెంబర్ 4న హత్యాయత్నం ఇలా చాలా ఘటనలు జరిగాయి.  ఎన్నికలు వచ్చాయంటే చాలు ఏ క్షణంలో ఎవరు ప్రాణం తీస్తారో అనే పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు సినిమాలు కేవలం రాయలసీమలో మాత్రమే ఉంటాయి అనుకున్న నెత్తుటి రాజకీయాలు ఇప్పుడు తెలంగాణకు కూడా పాకిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: