ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అధ్యక్షతన తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చింది. ఇక వీరు ఐదు సంవత్సరాల పాటు మంచి పరిపాలననే కొనసాగించినప్పటికీ 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పార్టీ కంటే వైసీపీ పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది. దానితో కేవలం ఐదు సంవత్సరాలలోనే చంద్రబాబు గవర్నమెంట్ కూలిపోయి వైసీపీ గవర్నమెంట్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.

ఇకపోతే జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు మంచి పరిపాలననే కొనసాగించింది. ఎక్కువ శాతం సంక్షేమ పథకాలపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాస్త అటు ఇటు అయినప్పటికీ ఎంతో మంది పేద ప్రజలకు , మహిళలకు , రైతులకు అనేక పద్ధతుల ద్వారా సహాయాన్ని చేసింది. ఇక దానితో ప్రజలకు మేము ఎంతో మంచి చేశాము. ఎంతో మంది కి ఎన్నో సంక్షేమ పథకాలను అందించాము. దానితో వారందరూ మా ప్రభుత్వం అంటే ఎంతో ఇష్ట పడుతున్నారు.

మళ్లీ మేమే అధికారం లోకి రావాలి అని , సంక్షేమ పథకాలు అన్ని ఇలాగే ఎంతో సంతోషకరమైన వాతావరణం లో ముందుకు సాగాలి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంతా భావిస్తున్నారు అని అందుకే ఎక్కువ శాతం ఓటింగ్ ఈ సారి జరిగింది అని సంక్షేమ పథకాలను సరైన సమయం లో సరైన పద్ధతిలో ప్రజలకు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం లోకి రాబోతున్నాడు అని వైసీపీ పార్టీ నాయకులు , కార్యకర్తలు ఎంతో దృఢంగా నమ్ముతున్నారు. మరి మళ్ళీ వైసీపీ పార్టీ అధికారం లోకి వస్తుందో లేదో తెలియాలి అంటే జూన్ 4 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: