ఈమధ్య నందమూరి కుటుంబంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ మధ్య వార్ కూడా జరుగుతూనే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బాలయ్య వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు నందమూరి కుటుంబంలో ఉండే విభేదాలు బయటపడుతూ ఉంటాయి. తాజాగా బాలయ్య చేసిన వాక్యాలు మరొకసారి ఎన్టీఆర్ అభిమానులను ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి. మొన్న జరిగిన ఎన్నికలలో బాలయ్య చాలా రోజులుగా పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు. పార్టీని గెలిపించడం కోసం తన వంతు కృషిగా కష్టపడ్డారు.


ఇటీవల సత్యభామ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన బాలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ తను 40 రోజులుగా ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నానని అందుకే 40 రోజులపాటు కెమెరాని మిస్ అయినట్టుగా తెలియజేశారు.. ఎన్టీఆర్ వారసులు అని చెప్పుకోవడానికి ఆయన గురించి చెప్పుకుంటే సరిపోదని ఆయన సినిమాల గురించి గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన వారసులు ఎవరూ కారని కూడా తెలియజేశారు బాలయ్య.. సీనియర్ ఎన్టీఆర్ గారు చూపించిన మార్గంలోని నడిచే వారే ఆయన వారసులు అని కూడా తెలియజేశారు.


అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించే చేశారనే విధంగా బాలయ్య అభిమానులు తెలియజేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు కాబట్టే ఇలా అంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అసలు బాలయ్య కు ఏం తెలుసని కూడా అడుగుతున్నారు.. కేవలం తన అల్లుడిని టిడిపి పార్టీలో సీఎం హోదాలో చూడాలని అక్కస్సుతోనే ఇలా మాట్లాడుతూ ఉన్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యని ఎద్దేవా చేస్తున్నారు. కావాలని జూనియర్ ఎన్టీఆర్ ని టిడిపి పార్టీలో తొక్కేస్తున్నారనే విధంగా తెలియజేస్తున్నారు. బాలయ్యకు కూడా ఎన్టీఆర్ అభిమానులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: