ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పూర్తయిన నేపథ్యంలో... వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఎదురు చూసినట్లు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చాలా మంది బెట్టింగ్ కూడా కాస్తున్నారు. తెలుగుదేశం కూటమి గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్ పెడుతుంటే... మరికొంతమంది వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని... బెట్టింగ్ చేస్తున్నారు.


 అయితే ఈ నేపథ్యంలో... ఈసారి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారని అన్ని సర్వేలు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని సర్వే సంస్థలు  గ్రౌండ్ స్థాయిలో సర్వేలు నిర్వహించాయి. అప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారని తేలిపోయిందట. ఇలాంటి నేపథ్యంలో... కూటమి అధికారంలోకి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రెండు మంత్రి పదవులు వస్తాయని చెబుతున్నారు.


అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాలలో జనసేన పార్టీ కాస్త తగ్గిందని... వాస్తవానికి 55 పైగా సీట్లలో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేయాల్సి ఉండేదని కొంతమంది అంటున్నారు. కానీ ఏపీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ 21 సీట్లకు తగ్గారని చెబుతున్నారు. అలాంటి గొప్ప నాయకుడికి... రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని... కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు... హోంమంత్రి శాఖ అలాగే... డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అంటున్నారు.


ఈ రెండు పదవులు వస్తేనే.... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు  మంచి గౌరవం దక్కుతుందని చెబుతున్నారు. లేకపోతే... జనసేనకు మరోసారి అన్యాయం జరుగుతుందని అంటున్నారు. జనసేన ఎమ్మెల్యేలలలో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వకుండా సరే కానీ... పవన్ కళ్యాణ్ కు మాత్రం ఈ రెండు మంత్రి పదవులు ఇవ్వాలంటున్నారు జనసైనికులు. మరి కూటమి అధికారంలోకి వస్తే... పవన్ కళ్యాణ్ కు ఎంత మేరకు ప్రాధాన్యత ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: