తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేతలలో దేవినేని ఉమా ఒకరు. ఈయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానిని అనుభవించి ఆ తర్వాత అధికారం పోగానే పక్క పార్టీకి వెళ్లి అక్కడ సుఖాలను అనుభవించే రకం వ్యక్తి కాదు. ఈయన రాజకీయ రంగ ప్రవేశాన్ని టీడీపీ లో చేసి ఆ పార్టీ ద్వారానే నాలుగు సార్లు గెలుపొంది , ఒకసారి ఓడిపోయిన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వెంట దాని అధినాయకుడు అయినటువంటి చంద్రబాబు వెంట ఉన్నాడు.

ఉమా తన రాజకీయ జీవితాన్ని తన సోదరుడు మాజీ మంత్రి దేవినేని వెంకట రమణ సహాయకుడిగా మొదలుపెట్టాడు. ఆ తర్వాత 1999 లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో ఉమా సోదరుడు ఆకస్మిక మరణంతో ఉమ పూర్తి రాజకీయాల్లోకి వచ్చాడు. క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వ ఉమ నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో విజయం సాధించాడు.

2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పరాజయం పొందింది కానీ ఆ రెండు అసెంబ్లీ ఎన్నికలలో ఈయన గెలుపొందారు. కానీ ఆ సమయంలో పార్టీ మారకుండా తెలుగుదేశం లోనే ఉండి ఆ పార్టీ భవిష్యత్తు కోసం ఎంతో పని చేశారు. ఇక ఆ సమయంలో ప్రతిపక్షానికే పరిమితం కావడంతో అటు 2004 లో నందిగామ నుంచి , 2009 లో మైలవరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన ఉమా అటు తన అసెంబ్లీ , ఇటు కృష్ణా జిల్లాలో పార్టీ తరుపున సమస్యల మీద పోరాటం చేయడం మొదలుపెట్టారు.  

ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కష్ట కాలంలో పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం కృష్ణ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించి జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహించే మెట్ట ప్రాంతంలోనే కాకుండా జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగింది . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభిజన సమయంలో సమైక్య ఆంధ్ర కోసం విజయవాడ లో ఈయన ఉద్యమం చేశారు.
2014 లో ఆంధ్రప్రదేశ్ విభిజన జరిగిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నుంచి రెండో సారి శాసనసభ్యుడిగా ఎన్నికైన ఉమా , ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు మంత్రి వర్గం లో జలవనరుల శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించి పట్టిసీమ , పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకాలను అతితక్కువ కాలంలో పూర్తి చేసి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇకపోతే 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో ఈయన వైసీపీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇక ఈసారి ఉమ మైలవరం టీడీపీ టికెట్ రాకపోవడంతో  విజయవాడ పార్లమెంట్ , అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ నియమించింది. ఆ బాధ్యతలను కూడా ఈయన ఎంతో చిత్తశుద్ధితో నిర్వహించాడు. ఇలా తెలుగుదేశం పార్టీతోనే ఉంటూ చంద్రబాబు నాయుడు కుడి భుజంగా , సలహాదారుడిగా ఎన్నో నిర్ణయాలు ఆయన తీసుకునే విధంగా చూసి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం ఎంతో పాటుపడిన వ్యక్తులలో ఉమా కూడా ఒకరిగా నిలిచిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Du