ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు తాడిపత్రి నియోజకవర్గం ఇక్కడ ఎప్పుడూ కూడా గొడవలు కేసులు సర్వసాధారణంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా వైసిపి టిడిపి నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనేలా రాజకీయాలు ఉంటాయి. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య వైర్యం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి నీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కలవడంతో ఇప్పుడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.


ధర్మవరం నియోజకవర్గ వైసిపి నేతలపైన కేసు నమోదు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాడిపత్రి అల్లర్లతో ధర్మవరం నేతలకు ఎలాంటి సంబంధం లేదని  పెద్దారెడ్డి జిల్లా ఎస్పీ గౌతమికి వివరించారు. కేవలం వారు తమని పరామర్శించేందుకు మాత్రమే వచ్చారని తెలియజేశారు. ధర్మవరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన కేసులు బకాయించాలని చూస్తున్నారని ఒకవేళ ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా ఫ్యాక్షను ప్రేరేపించినట్లు అవుతుందని కూడా తెలియజేశారు పెద్దారెడ్డి. పోలింగ్ రోజున ప్రారంభమైన ఈ ఉద్రిక్తత ఇప్పటికీ కూడా చల్లారలేదు.


ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జెసి ప్రభాకర్ రెడ్డి వర్గాల రాళ్లదాడికి ప్రయత్నించారు. దీంతో తాడిపత్రిలో ఘర్షణ వాతావరణ మరొకసారి ఏర్పడింది. దీంతో పోలీసులు ఇరువురి వర్గాలను చెదరగొట్టారు.జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద వైసీపీ నేతలు సైతం గొడవకు దిగారు. దీంతో పోలీసులు విసిరినటువంటి టియర్ గ్యాస్ తో జెసి ప్రభాకర్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. పెద్ద రెడ్డి మాత్రం అప్పటినుంచి ఆచూకీ కనిపించలేదు. దీంతో అభిమానుల సైతం చాలా ఆందోళన పడ్డారు. పోలీసుల దివాకర్ రెడ్డి కుటుంబాన్ని హైదరాబాద్ కి తరలించడం జరిగింది. జెసి కుటుంబాన్ని తాడిపత్రిలోకి అసలు అనుమతించమంటూ కూడా అధికారులు తెలియజేశారు.


అలాంటి సమయంలో వైసీపీ నాయకులు తాడిపత్రికి వెళ్లి పెద్దారెడ్డిని పరామర్శించారు. దీంతో కాస్త స్వల్ప ఉద్రికత్త ఏర్పడడంతో వీటి పైన కేసులు పెట్టాలంటూ టిడిపి నేతలు డిమాండ్ చేశారు. ఈ సమయంలో కేతరెడ్డి పెద్దారెడ్డి గౌతమి షాలిని కలిసి తనను కేవలం పరామర్శించడానికి వచ్చిన నేతల పైన అక్రమ కేసులు పెట్టవద్దని అలాంటివి జరిగితే తానేంటో చూపిస్తాను అంటూ కూడా వారిని ఇచ్చారు పెద్దారెడ్డి..

మరింత సమాచారం తెలుసుకోండి: