తెలుగుదేశం పార్టీలోని ప్రముఖ నేతలలో బోండా ఉమా మహేశ్వరరావు ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. సాధారణ కార్యకర్తగా కెరీర్ ను మొదలుపెట్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన బోండా ఉమ బాబు గురించి ఎవరైనా విమర్శలు చేస్తే అస్సలు తట్టుకోలేరు. 2019 ఎన్నికల్లో కొన్ని ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై బోండా ఉమ ఓడిపోవడం జరిగింది. టీడీపీ జనసేన వేర్వేరుగా పోటీ చేయడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయానని భావించిన ఆయన ఈ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా గెలుస్తానని నమ్ముతున్నారు.
 
చంద్రబాబు డైనింగ్ టేబుల్ వరకు వెళ్లే స్వాతంత్రం ఉన్న వ్యక్తి బోండా ఉమ అని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. బాబుతో అంత అనుబంధం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 2012 సంవత్సరంలోనే వ్యాపారాలు ఆపేసిన బోండా ఉమ ఆ తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితమయ్యారు. బోండా ఉమ ప్రజల కోసం ఏం అడిగినా చంద్రబాబు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించారని తెలుస్తోంది.
 
చంద్రబాబుపై చిన్న మాట ఎవరు మాట్లాడినా ధీటుగా స్పందిస్తూ ఇతర పార్టీల నేతలకు వణుకు పుట్టించే నేతగా బోండా ఉమ గుర్తింపును సంపాదించుకున్నారు. బోండా ఉమ ఈ ఎన్నికల్లో విజయం సాధించి కూటమి అధికారంలోకి వస్తే ఆయనకు మంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బోండా ఉమ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే నేతగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.
 
చంద్రబాబు సైతం బోండా ఉమకు తగినంత ప్రాధాన్యత ఇస్తూ అయనతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ ప్రజలు సైతం బోండా ఉమను ఎంతో అభిమానిస్తారని ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని టాక్ ఉంది. బోండా ఉమ ఏపీ రాజకీయాలలో ఒకింత దూకుడు స్వభావంతో ముందడుగులు వేసే నేతగా పేరు సంపాదించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన ఆయనకు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: