ఈసారి ఏపీలో అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది. బిజెపి జనసేన టిడిపి లతో కూడిన కూటమి అధికారాన్ని చేజిక్కించుకోబోతుందా.. లేకపోతే జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వబోతున్నారా అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఒక్కసారి ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్..  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇక వాలంటీర్ వ్యవస్థను స్థాపించి ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందేలా చూశారు.


 ఇక ఈ సంక్షేమ పథకాలే రెండోసారి తమను గెలిపించబోతున్నాయి అనే ధీమాతో ఉన్నారు. ప్రభుత్వ పథకాలు పొందిన ఎంతోమంది వైసీపీఫై కృతజ్ఞతతోనే ఉన్నారని వాళ్లే ఓటు వేసి రెండోసారి మమ్మల్ని గెలిపించబోతున్నారు అంటూ జగన్ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇక ఇప్పుడు ఈ ఎన్నికల కోసం కొత్తగా ఎలాంటి మేనిఫెస్టోని విడుదల చేయలేదు వైసిపి  గత పథకాలలోనే కొన్ని మార్పులు చేర్పులు చేసింది. అయితే ఇదే వైసీపీకి మైనస్ గా మారిపోయింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు  ఎందుకంటే ఏ పార్టీ  ఎక్కువ మొత్తంలో పథకాలను అందిస్తుంది అనే విషయాన్ని ప్రజలు చూస్తూ ఉంటారు  అయితే ఇక ప్రస్తుతం వైసీపీ అందిస్తున్న పథకాలతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తంలో పథకాలు అందిస్తామని టిడిపి మేనిఫెస్టో విడుదల చేసింది.


 ఇలా ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తామని హామీ ఇస్తే అటువైపుకు వెళ్లే జనాలు.. కొత్త మేనిఫెస్టో ప్రకటించని వైసీపీకి దూరమయ్యారు అని అభిప్రాయపడుతున్నారు. ఇక వైసిపి కొత్త మేనిఫెస్టోని ప్రకటించకపోవడం కొత్త పథకాలు ఏవి తెరమీదకి తీసుకురాకపోవడంతో.. ఇక కూటమికే మద్దతు పలికే ఉంటారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది  అయితే జగన్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉన్న పథకాలకు తోడు మరికొన్ని పథకాలను కలిపి కొత్త మేనిఫెస్టో ప్రకటించి ఉంటే జగన్ కు ప్లస్ అయి ఉండేదని.. అలా చేయకపోవడం వల్ల ఎక్కువ మొత్తంలో ఓట్లు కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఆంధ్ర ప్రజలు ఎవరికి అధికారాన్ని కట్టబెట్టారు  అన్నది మాత్రం రిజల్ట్ తర్వాతే తెలియబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: