ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఒకటే టాపిక్ ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారు..? ఎవరు అధికారంలోకి వస్తారు. సిటీలో ప్రజలు బిజీ లైఫ్ వల్ల ఎక్కువగా విటి గురించి మాట్లాడుకోలేకపోయినా గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం ఏ చెట్టు కిందో , లేక ఎక్కడో ఒక చోట సమయం దొరికినప్పుడు కాసేపు కూర్చున్నారు అంటే చాలు వారికి వచ్చే టాపిక్ మన నియోజకవర్గం లో ఎవరు గెలుస్తారు..? ఓకే అతను మన నియోజకవర్గంలో గెలుస్తాడా..? మరి మొత్తం రాష్ట్రంలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి.

మళ్లీ ఎవరు సీఎం అవుతారు. ఇలాంటి విషయాలు ఎక్కువగా తెరపైకి వస్తూ ఉంటాయి. దానిలో కొంత మంది ఈ సారి కూటమి గాలి బలంగా వీస్తూ ఉండడంతో వారే గెలిచే అవకాశం ఉంది అనే విషయాన్ని తీసుకువస్తే , మరి కొంత మంది మాత్రం ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి వైసీపీ అనేక సంక్షేమ పథకాలను మన ఇంటి వరకు తీసుకువచ్చింది. అలాంటి పార్టీ నే మళ్లీ వస్తే బాగుంటుంది అని కొంత మంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా వర్షాన్ని నమ్ముతూ ఉంటారు. ఎందుకు అంటే వర్షాలు సరిగ్గా పడితే పంటలు ఎక్కువగా పండుతాయి. వాటి ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. దానితో చంద్రబాబు హయాంలో ఎక్కువగా వర్షాలు పడలేదు. కరువు ఎక్కువ ఉంది. ఇక జగన్ ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాలు వర్షాలు చక్కగా పడ్డాయి. వాటి వల్ల రాష్ట్రం లోని గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయి. ఇక కొన్ని రోజుల క్రితమే ఎలక్షన్ లు ముగిసాయి.

అంతలోనే అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. అలాగే మరికొన్ని రోజుల్లో మంచిగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. ఇదంతా జగన్ గెలవడానికి సంకేతాలు అని కొంత మంది గ్రామీణ ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా గ్రామీణ ప్రజలు వర్షా సూచనను బట్టి జగన్ సీఎం గా ఉన్న ఐదు సంవత్సరాలు మంచిగా వర్షాలు పడ్డాయి. మళ్లీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ సూచిస్తూ ఉండడంతో ఇదంతా జగన్ గెలవడానికి సంకేతాలుగా వారు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: