సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, సినీ నటుడు బాలకృష్ణఎలక్షన్స్ లో హిందూపురం నుంచి బరిలో దిగినట్టు మనకు తెలుసు.ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నేత, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ కలిశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న బాలకృష్ణ ఆయనతో మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపి ఆయనతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఇరువురు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలపై చర్చించారు.రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇరువురు భేటీ కావడం ఇది తొలిసారి కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేరుగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. పైకి సాధారణ సమావేశమైనా, కీలక విషయాలు చర్చించారని అంటున్నారు పలువురు నేతలు. బాలకృష్ణ గారు రేవంత్ రెడ్డి ని కలవడం ఈ ఎన్నికల హీట్‌ను మరింత పెంచుతున్నాయి.వీరి భేటీపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దానికి తోడుగా ఇటీవల తిరుపతిని సందర్శించిన రేవంత్ రెడ్డి అక్కడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత కీలకంగా మారుతున్నాయి.

 అంతేకాకుండా టీడీపీ, రేవంత్ రెడ్డి మధ్య సంబంధాలపై కూడా అనేక అనుమానాలు రేకేత్తిస్తున్నాయి.కౌంటింగ్ చేరువలో ఉన్న సమయంలో వీరెందుకు భేటీ అయ్యారు? రాష్ట్ర విభజన సమయంలో ఒప్పందం ప్రచారం రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన పంపకాల గురించేనా? లేకుంటే మరేదైనా విషయమా? అన్నదే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా ఉంది. ఈ భేటీలో బాలకృష్ణతో పాటు బసవతారకం ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. బాలకృష్ణ, రేవంత్ ఇద్దరూ అనేక అంశాలపై చర్చించుకున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. వీటిలో ఆంధ్ర రాజకీయ పరిస్థితుల అంశం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సందర్బంగానే ఆంధ్రలో ప్రభుత్వం మారుతుందనడానికి వీరిద్దరి భేటీ నిదర్శనమని పలువురు చెప్తున్నారు. దానికి తోడు ఈ అంశం తెలిసే తిరుపతిని సందర్శించిన సమయంలో రేవంత్ ఆ వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు వీరు కలవడం ఆయన వ్యాఖ్యలను బలపరుస్తున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది.


''ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం కోసం కలిసి పని చేస్తాం'' అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు బాలకృష్ణ, రేవంత్ భేటి అయ్యింది కూడా భవిష్యత్తులో టీడీపీ ప్రభుత్వం వస్తే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా కలిసి పనిచేయాలని, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలని అన్న అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. కానీ అసలు వీరు ఏ అంశాలపైన చర్చించారన్నది మాత్రం క్లారిటీ లేదు. ఈ అంశంపై ప్రతి ఒక్కరూ అంటున్న మాట.. అసలు ఏం చర్చించారన్నది వారే చెప్పాలని. మరి వారు ఈ భేటి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు, తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినవారిలో ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బాలకృష్ణల మధ్య పలు అంశాల మీద చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. బసవతారకం ఆస్పత్రితో పాటు.. తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఇరువురు మధ్య చర్చ జరిగిందనే ప్రచారం కూడా సాగుతుంది.అయితే.. ఇటీవలే ఎన్నికల హడావుడి అనంతరం కాస్త విశ్రాంతి తీసుకున్న బాలకృష్ణ ఇప్పుడే మళ్లీ బయటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం కాజల్ నటించిన సత్యభామ ఈవెంట్లో పాల్గొన్న బాలయ్య మళ్లీ తాజాగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ కలయికకు సంబంధఙంచిన పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: