ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరానికి గాను అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు మే 13 వ తేదీన జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సారి పోయిన సారి కంటే ఓటింగ్ శాతం కాస్త ఎక్కువ జరిగింది. దానితో చాలా మంది ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉన్న సమయం లోనే ఇలా ఓటింగ్ జరుగుతుంది అని , అది కూటమికి కలిసి వచ్చే అంశంగా వైసీపీ కి కలిసి రాని అంశంగా పరిగణించారు. ఇక ఇలాంటి పరిణామాల వల్ల జగన్ కాస్త అయోమయంలో పడతాడు అని అంతా భావించారు.

ఇక ఎలక్షన్ లు ముగిసిన ఓ రెండు రోజుల తర్వాత జగన్ ఓ సమావేశంలో పాల్గొన్నారు. అందులో భాగంగా జగన్ మాట్లాడుతూ ... మాకు 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 151 అసెంబ్లీ స్థానాలు 22 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. ఆ ఎలక్షన్ లాలి ముందు మేము 150 యొక్క అసెంబ్లీ స్థానాలు గెలుపొందుతాం అంటే ఎవరు నమ్మలేదు. అదే చివరకు జరిగింది. ఇక ఈ సారి పోయిన సారి వచ్చిన అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అని , అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా మాకు పోయిన సారి కంటే ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి అని చెప్పాడు. ఇలా చెప్పడంతో అంతా షాక్ అయ్యారు.

పోయిన సారి కంటే ఈ సారి ఓటింగ్ శాతం ఎక్కువ జరిగింది , అది కూటమికి అనుకూలం అని ఎంతో మంది విశ్లేషకులు చెబుతూ ఉంటే జగన్ మాత్రం ఇంత ధైర్యంగా మాకు పోయిన సారి కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది అని చెప్పడంతో జగన్ ఏ ధైర్యం తో ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. నిజంగా ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా ఈ మాట అని ఉంటాడా..? ఆయన ఇంత కాన్ఫిడెన్స్ గా అన్నాడు అంటే 150 కాకపోయినా అధికారం లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని కూటమి అధికారంలోకి రావాలి అని ఆశించే ప్రజలు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: