ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠం రోజురోజుకీ పెరుగుతోంది. గెలుపు పైన అన్ని పార్టీలు ధీమాని తెలియజేస్తున్నాయి.. జగన్ తాను 2019లో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తానని ధీమాతో ఉన్నారు. కూటమి కూడా గెలుపు పైన ధీమాని అదే వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో వైసీపీ పార్టీ పైన షర్మిల ప్రభావం ఏంటనే విషయం కీలకంగా మారుతోంది. గడపలో షర్మిల కు వచ్చే ఓట్ల గురించి ఇప్పుడు ఆసక్తికర విషయం వినిపిస్తోంది.. పిసిసి చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగన్ పైన కాస్త ఎక్కువగానే దూకుడు వ్యవహరిస్తున్నది.


ఎన్నికల ప్రచారంలో వైసీపీనే లక్ష్యంగా పెట్టుకొని షర్మిల వ్యవహరించింది. ముఖ్యంగా అవినాష్ ను వివేక హత్యపై ఆరోపణలు చేస్తూ ఉండేది. వైసీపీలో సీటు రాను వారందరినీ కాంగ్రెస్లోకి పిలిచి మరి సీట్లు కేటాయించింది షర్మిల. అలాగే కడపలో షర్మిల ప్రభావం ఎవరికి గండి కొట్టిందని చర్చ కూడా ఇప్పుడు మొదలవుతోంది. కడప పార్లమెంట్ అభ్యర్థిగా షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది. వరుసగా హ్యాట్రిక్ సాధించాలని విజయంతో అవినాష్ ప్రయత్నించినప్పటికీ.. ఇక్కడ ఓటింగ్ చాలా కీలకంగా మారింది.


కడప ఎంపీగా షర్మిల డిపాజిట్లు కూడా దక్కవని జగన్ తెలియజేశారు.. కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఓట్ల విషయంలో టిడిపి వైసిపికి చాలానే పోల్ అయ్యాయని తెలుస్తోంది. అయితే ఎంపీ ఓట్ల విషయంలో మాత్రం వైసిపి తర్వాత స్థానంలో కాంగ్రెస్ కు ఎక్కువగా ఓట్లు పోలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు కొన్ని నియోజకవర్గాలలో చెప్పుకోదగ్గ స్థాయిలలో ఓట్లను అందుకోలేకపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి.. షర్మిల ప్రచారం చేయడం వల్ల వైసీపీ ఓట్ బ్యాంకుకు గండి పడిందని ప్రచారం వినిపించింది.. కానీ ఎన్నికల సమిష్ఠను చూస్తే మాత్రం వైసీపీకి  నష్టం  జరిగే విధంగా కాంగ్రెస్కు ఎక్కడ ఓటింగ్ నమోదు కాలేదని కనిపిస్తోంది. కేవలం చీరాల, సింగనమల, కోడూమూరు వంటి ప్రాంతాలలో ఓటింగ్ కాంగ్రెస్కు పడినట్లు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి పూర్తిస్థాయిలో లెక్కలు తెలియాలంటే జూన్ 4 వరకు ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: