ఊర్లో పెళ్లికి.. కుక్కల హడావిడి అన్నట్లుగా.. ప్రజెంట్ ఎన్నికల ఫలితాలు రాకుండా పలువురు పోట్లాడుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరో 10 రోజులు గడువు ఉంది. ఇక ఇంతలో సమయం గడిపేదెలా? అనే రచ్చ ఉంది. దీంతో అటు టిడిపిలోనూ.. ఇటు వైసిపి లోను కూడా తమ తమ ప్రభుత్వాలు ఏర్పడితే.. ఏం చేస్తారు? ఏం జరుగుతుంది? అనే రచ్చ జోరుగా సాగుతుంది. టిడిపి కూటమి వస్తే అంటూ కొన్ని సోషల్ మీడియాలో కథనాలు షికారు చేస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు వైసిపి అధికారం చేపడితే.. ఏం జరుగుతుంది? అనేది ఆసక్తిగా మారింది.

మరీ ముఖ్యంగా జగన్ కనుక అధికారంలోకి వస్తే.. మంత్రి వర్గం లో మహిళలకు అవకాశం కచ్చితంగా ఉంటుందనేది తెలిసిందే. గతంలో చంద్రబాబు కూడా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక ఇప్పుడు జగన్ కూడా.. అంతకు కొంత యాడ్ చేసి ప్రాధాన్యం ఇస్తున్నారు. సో ఇలా చూస్తుంటే జగన్ ఈ విషయంలో ఒక మెట్టు ముందే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు.. మంగళూరులో కనుక నారా లోకేష్ ను ఓడించి.. గెలిస్తే.. మురుగుడు లావణ్య కు బిసి కోటా లో మంత్రి పదవి ఖాయమని ఒక అంచనా తెర మీదకి వచ్చింది. నిజానికి పోలింగ్ రోజునే.. ఈ టాపిక్ అంతర్గతంగా వైసిపి నాయకులు ముందుకు  తీసుకెళ్లారు. తద్వారా ఓటింగ్ తమకు అనుకూలంగా పడేలా తెలివితేటలతో వ్యవహరించారు.

ఇక ఇదే కోటలో హిందూపురం నుంచి బాలయ్య య్యను ఓడిస్తే.. అక్కడ బరిలో ఉన్న దీపికాకు కూడా.. మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఎలానూ పిఠాపురంలో పవన్ ను ఓటమి పాలు చేస్తే వంగా గీతా కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని ఎన్నికల ప్రచారంలోనే జగన్ చెప్పడం జరిగింది. అదే సమయంలో గత ప్రభుత్వంలో ఎస్టీ కోటా కింద.. కురూపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కి మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే ఈసారి పాలకొండ నుంచి విశ్వాసరాయి  కళావతికి కచ్చితంగా చోటు దక్కుతుందని అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా పాతపట్నం నుంచి విజయం దక్కించుకుంటే.. రెడ్డి శాంతికి కూడా అవకాశం కల్పిస్తారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఏది ఎలా ఉన్నా.. ఈసారి కూడా నలుగురు నుంచి ఐదుగురు వరకు మంత్రివర్గంలో మహిళ నేతలు ఉండే అవకాశం ఉందని లెక్కలు రావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: