ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు ఓటింగ్ ప్రక్రియలో ఎవరికి తోచిన విధంగా వారు చెప్పేసుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా ఓటింగ్ ప్రక్రియలో కమ్మవాళ్ళు అంత ఒక్కటిగా చేరి చాలా సీరియస్ గా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఓటు వేశారు. ఈసారి తెలుగుదేశం పార్టీ ఓడితే కమ్మ సామాజిక వర్గం భూస్థాపితానికి అవుతుందని.. ఉద్దేశంతోనే వాళ్లు చాలా సిన్సియర్గా ఎఫెక్ట్ చూపించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఓపెన్ గా వినిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు కృష్ణ ప్రసాద్, శ్రీకృష్ణదేవరాయలు వంటి వారు కూడా కుటుంబ సభ్యుల ప్రెజర్ తోనే ఇటు వైసిపి వైపుకు వచ్చి టోటల్గా ప్రయత్నించినటువంటి ఇష్యూ..



పవన్ కళ్యాణ్ కూడా కమ్మ సామాజిక వర్గం దెబ్బ తినకూడదని ఉద్దేశంతోనే మద్దతు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి రెడ్డి సామాజిక వర్గం జగన్కు అండగా ఉందా లేదా అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. 2014లో రెడ్డి సామాజిక వర్గం పెద్దగా 70 శాతం వరకు జగన్ కి సపోర్ట్ చేసిన.. 30% నెత్తిన పెట్టుకోలేదు. ఎందుకంటే అప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలోకి ఉన్నారు కాబట్టి.. ఆ ఎఫెక్ట్ చూపించింటుంది. 2019లో వచ్చేసరికి రెడ్డి సామాజిక వర్గం అంతా జగన్ ను ఓన్ చేసుకుంది.


ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నారు.. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో ఉన్నారు. వీరి వల్ల రెడ్డి సామాజిక వర్గానికి రాజకీయ అధికారం లేకుండా పోయింది. రెడ్డి సామాజిక వర్గం ఉనికికి ప్రశ్నార్ధకంగా మారిన సమయంలో 2018లో మళ్లీ కేసిఆర్ గెలిచారు.. ఇక ఆంధ్రాలో రెడ్లు గెలవకపోతే వారి యొక్క అస్తిత్వానికి ముప్పని.. పూర్తిస్థాయిలో సహకరించారు గెలుపులో సక్సెస్ అయ్యారు. 2024లో చూస్తే.. రెడ్లు బాగా కోపం ఉన్నది జగన్ మీద అన్నది .. కేవలం నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టి అంటున్నారు ఇచ్చిన పదవులలో కూడా హైయెస్ట్ గా వాళ్ళని తీసుకుంటూ ఉంటున్నారని.. రెడ్లకు ప్రాధాన్యత తక్కువగా ఇస్తున్నారని ఇతర పేపర్లలో కూడా వస్తోంది. ఇది మైనస్ గా మారింది.


ముఖ్యంగా బాగా డబ్బులు సంపాదించేటువంటి వాటిలో కేవలం ఒక్క శాతం రెండు శాతం మాత్రమే రెడ్లకు కేటాయించారు.. మిగతా వచ్చేసరికి గతంలో ఉండేటువంటి వారే ఉన్నారు. టిడిపి ప్రభుత్వం లో కమ్మ వాళ్ళు ఎలా సంపాదించారో జగన్ ప్రభుత్వంలో రెడ్లు అలా సంపాదించుకోవచ్చు అని అనుకున్నవారికి మొండి చెయ్యి ఏర్పడింది. ముఖ్యంగా రెడ్డి సామాజికం ఎఫెక్ట్ రాయలసీమలో.. నెల్లూరు , ప్రకాశం, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలలో.. దాదాపుగా 60 నుంచి 70 నియోజకవర్గాలలో రెడ్డి సామాజిక వర్గం  పోలింగ్ మీద డిపెండ్ అయ్యింది. దీంతో ఇన్ని నియోజకవర్గాలలో రెడ్లు ప్రభావితం చేయగలరు. వాళ్లు జగన్ ని ఓన్ చేసుకున్నారా లేదా.. దీంతో జగన్ గెలుపు ఆధారపడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: