ఆంధ్రప్రదేశ్  రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. గెలుపు తమదంటే తమది అంటూ ఏపీలో ఉన్న అన్ని పార్టీలు నాన రచ్చ చేస్తున్నాయి. మరోసారి అధికారంలోకి రాబోతున్నామని.. ఇప్పటికే వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించి లండన్ వెళ్లిపోయారు. దీంతో వైసిపి పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అటు ఎన్నికల తర్వాత సర్వేలు నిర్వహించుకుందట తెలుగుదేశం కూటమి. అందులో కూటమి అధికారంలోకి వస్తుందని తేలిందట. 

దీంతో తెలుగుదేశం కార్యకర్తలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో వైసిపి పార్టీకి కొత్త టెన్షన్ నెలకొంది. అదే ఇంటి దొంగలు.  వైసిపి పార్టీ ఒకవేళ ఓడిపోతే దానికి కారణం ఇంటి దొంగలు అని ప్రచారం జరుగుతోంది. ఈసారి... వైసిపి పార్టీ నేతలే... పార్టీని ఓడించేందుకు ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం చాలాచోట్ల జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చడం అని సమాచారం. 50 శాతానికి పైగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభ్యర్థులను మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ 50 స్థానాలలో... కొత్త అభ్యర్థులను తీసుకువచ్చారు.


 దీంతో... పాత నాయకులందరూ కలిసి కొత్త అభ్యర్థులను ఓడించేందుకు విశ్వప్రయత్నాలు చేశారని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయట.  అంతేకాకుండా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇచ్చిన డబ్బులను సరిగా కార్యకర్తలు పంచ లేదట. చాలావరకు డబ్బులను వారే కాజేశారట. ఈ విషయం... కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో తెరపైకి వచ్చింది. అక్కడ ఒక్కో కార్యకర్త లక్షల్లో కొడాలి నాని డబ్బును తీసుకున్నారట. కానీ జనాలకు మాత్రం డబ్బులు పంచలేదట కార్యకర్తలు.


దానివల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిలిందని... కొడాలి నాని అనుచరుడు స్వయంగా మీడియా ముందు చెప్పాడు. ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో జరిగిందని వైసిపి లెక్కలు వేసుకుంటూ ఉందట. అంతేకాకుండా సీనియర్ లీడర్లు కొంతమంది ఎమ్మెల్యే టికెట్ రాలేదని జూనియర్లను ఓడించేందుకు కూడా ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి. దీంతో వైసిపి పార్టీలో కొత్త టెన్షన్ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: