ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ భారీ అసెంబ్లీ స్థానాలను గెలుపొంది ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక వీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు బాగానే పరిపాలించారు. దానితో వీరే మరోసారి అధికారం లోకి వస్తారు అని తెలుగు దేశం పార్టీ నేతలు , కార్యకర్తలు భావించారు. ఇక 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని ఆంధ్ర రాష్ట్రంలో అధికారం లోకి వచ్చింది. ఇక ఆఖరి ఐదు సంవత్సరాల్లో జగన్ పరిపాలనలో రాష్ట్రం బాగానే అభివృద్ధి చెందింది.

దానితో మరోసారి కూడా వీరే అధికారం లోకి రాబోతున్నట్లు వీరు భావిస్తున్నారు. 2024 సంవత్సరానికి గాను అసెంబ్లీ ఎన్నికలు మే 13 వ తేదీన ముగిసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాము. పోయిన సారి కంటే ఎక్కువ మెజారిటీ మాకు వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఒక వేళ నిజం గానే జగన్ ప్రభుత్వమే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారం లోకి వచ్చినట్లు అయితే ఇద్దరు మహిళ నేతలకు దాదాపుగా మంత్రి పదవి కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది వారెవరో తెలుసుకుందాం.

ఈ సారి ఉత్తరాంధ్ర జిల్లా కు చెందిన ఇద్దరు వైసీపీ మహిళా నేతలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎస్టి కోటాలో సీనియర్ ఎమ్మెల్యే అయిన పాలకొండకు చెందిన విశ్వాసరాయి కళావతి కి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈమె వరసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. ఈ.సారి ఈమె గెలిచి వైసీపీ అధికారం లోకి వస్తే ఈమెకు మంత్రి పదవి దక్కి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈమెతో పాటు పాతపట్నం ఎమ్మెల్యే క్యాండిడేట్ రెడ్డి శాంతి కి కూడా మంత్రి పదవి దక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక సారి ఎమ్మెల్యే గా గెలిచి రెండవ సారి పోటీ చేస్తుంది. ఈ సారి ఈమె కూడా గెలిచి వైసీపీ అధికారం లోకి వస్తే ఈమెకు కూడా మంత్రి పదవి కి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: