ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఓటింగ్ పూర్తి అయిన తర్వాత ఎవరి లెక్కలు వాళ్ళు తెలియజేస్తూ అధికారం మాది అంటూ ఉంటున్నారు. వైసిపి పార్టీ మేమే ఎక్కువ గెలుస్తాం అనుకుంటోంది. టిడిపి కూడా మేమే ఎక్కువ గెలుస్తాం అనుకుంటోంది. అయితే ఇక్కడ రెండు కీలకమైన విషయాలు ఉన్నవి. వైసిపి వాళ్ల అంచనా ఏమిటంటే.. రాయలసీమ ప్రాంతంలో 40 సీట్లు దాకా వస్తాయని.. ఉత్తరాంధ్రలో ఒక 15 సీట్ల వరకు వస్తాయని ఇంక్లూడింగ్ వైజాగ్ తో కలిపితే కనీసం ఒక 20 సీట్లైనా వస్తాయని అంచనా వేస్తున్నారు..



మొత్తం మీద అక్కడొక 40 ఇక్కడ ఒక 20 మొత్తం 60 సీట్లు.. మిగతా గోదావరి జిల్లాలలో ఒక 10 సీట్లు వస్తాయని.. కృష్ణ గుంటూరు జిల్లాలలో ఒక 10 సీట్ల దాకా.. కచ్చితంగా వస్తాయని నమ్మకంతో ఉన్నారు. నెల్లూరు ప్రకాశం జిల్లా వైపు ఒక 10 సీట్లు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 100 సీట్లకు తగ్గవని నమ్మకంతో ఉన్నారు. వాస్తు సినాలియోలో వైసీపీ వాళ్లు అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో ఉత్తరాంధ్ర తమను ఆదరిస్తుందని నమ్మకంతో ఉన్నారు.


తెలుగుదేశం వాళ్ళు ఏం లెక్కిస్తున్నారంటే.. రాయలసీమలోని ఈసారి 30 స్థానాలు వస్తాయని.. నెల్లూరు జిల్లాలో 5 స్థానాలు కూటమికి వస్తాయని.. దీంతో 35 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలలో దాదాపుగా 15 సీట్లు వస్తాయని.. ఇక్కడే 45 సీట్ల వరకు వస్తాయని వాస్తు సినాలియో ప్రకారం అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాలలో 20 నుంచి 35 సీట్లు .. 75 నుంచి 80 సీట్ల వరకు అవుతున్నాయి అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో ఒక 20 నుంచి 30 సీట్లు గ్యారెంటీ అన్నట్టుగా లెక్క చేసుకుంటున్నారు. మొత్తం మీద 100 నుంచి 110 సీట్లు వస్తాయని తెలుపుతున్నారు. మరి ఎవరి లెక్కలు వారివే ఏది నిజం అన్నటువంటిది నాలుగో తారీఖు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: