ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ అసెంబ్లీ ఫలితాలపై అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు ఏపీ ప్రజలు. అందులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒకటి. సంచలన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ నెల్లూరు నియోజకవర్గమన్న సంగతి తెలిసిందే. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈసారి పోటీ రసవత్తరంగా మారింది. ఈసారి వైసీపీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి పోటీ చేస్తున్నాడు.


ఆయనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అంటే 2014 అలాగే 2019 ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ పార్టీ తరఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విజయం సాధించారు. అయితే జగన్ విభేదించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... వెళ్లారు.దీంతో నెల్లూరు రూరల్ టిడిపి అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బరిలో దిగారు. అటు వైసిపి తరపున ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు. దీంతో ఆ నియోజకవర్గంలో పోటీ చాలా రసవత్తరంగా మారింది. అయితే ఎలాగైనా హైట్రిక్ కొడతానని... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు.


వైసీపీకి వ్యతిరేకంగా పట్టణ ప్రజలు ఉన్నారని... గత పది సంవత్సరాలపాటు  నెల్లూరు రూరల్ ప్రజల సమస్యలు తీర్చానని... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రచారంలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు రూరల్ అభివృద్ధి కోసం అభిబందించే బయటికి వచ్చాను అని ఎమోషనల్ కామెంట్స్ కూడా చేశారు కోటంరెడ్డి. ఆయన కుటుంబం కూడా ప్రచారంలో బాగానే తిరిగింది..  నారా లోకేష్, బాలయ్య బాబు, చంద్రబాబు కూడా కోటంరెడ్డి కోసం ప్రచారం చేశారు. దీంతో ఎలాగైనా కోటంరెడ్డి విజయం సాధిస్తారని టిడిపి అంటుంది. ఇక అటు వైసిపి అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి.... సంక్షేమ పథకాలను ప్రచారంలో గట్టిగానే ప్రచారం చేశారు.


వైసిపికి కోటంరెడ్డి రాజీనామా చేసిన తర్వాత.. ఆ నియోజకవర్గానికి చాలావరకు నిధులు ఇప్పించారు. అలాగే విజయ్ సాయి రెడ్డి... నెల్లూరు ఎంపీగా పోటీ చేయడంతో అందరూ యాక్టివ్ గా పని చేశారు. ముఖ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయానికి కారణమైన మలిరెడ్డి బ్రదర్స్ ను వైసీపీలోకి లాగేసారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. మలిరెడ్డి బ్రదర్స్ అసలు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండరు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాత్రం గెలిపించడంలో వారి పాత్ర ఉంది. అలాంటి వారిని వైసీపీలోకి తీసుకొని ఆధాల ప్రభాకర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అలా అడుగడుగునా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎదురు దెబ్బ కొడుతూనే ఉన్నారు ఆదాల. దీంతో వైసిపి విజయం సాధిస్తుందని ఆయన అంటున్నారు.  మరి ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: