ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల హడావిడి లో ఉన్న నేపథ్యంలో... పులిచింతల ప్రాజెక్టు గురించి ఎవరు పట్టించుకోలేదు. అందరూ ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతలోపే పులిచింతల ఎండిపోయింది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. క్రితం ఏడాది వర్షాలు సరిగా పడలేదన్న సంగతి తెలిసిందే.


ఈ సారి విపరీతంగా ఎండలు దంచి కొట్టాయి. దీంతో భూగర్భ జలాలన్నీ ఎండిపోయాయి. వీటన్నిటి నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయింది. వాస్తవానికి పలనాడు జిల్లా పులిచింతల సమీపంలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకువచ్చారు. 2009 సంవత్సరంలో చేపట్ట తలిచిన ఈ ప్రాజెక్టు... ఏకంగా 1850 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మితమైంది. 2013 నుంచి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది.


అయితే... ఈ పులిచింతల ప్రాజెక్టు  నీటి సామర్థ్యం 45.75 టీఎంసీలు. అయితే 2023  వర్షాలు సరిగా పడలేదు. కర్ణాటక ఇలాంటి ఎగువ ప్రాంతాలలో వర్షాలు తక్కువ పడడంతో.. కృష్ణా నదికి వరదలు తక్కువ వచ్చాయి. దీంతో ఈసారి పులిచింతల ప్రాజెక్టు ఎండిపోయింది. అదే 2021 సంవత్సరంలో.. విపరీతంగా వరదలు రావడంతో పులిచింతల కళకళలాడింది.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.దీనంతటికీ వైసీపీ ప్రభుత్వం వైఫల్యం అని  తెలుగుదేశం ఆరోపణలు చేస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రతి ఏడాదికి చాలావరకు  టీఎంసీలు తీసుకువచ్చి 3 సంవత్సరాలు నీటిని అందించి పులిచింతలను నింపారు. కానీ ఈ విషయంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చర్చ జరుగుతోంది.


 పులిచింతల ప్రాజెక్టుకు నీళ్లు తీసుకువచ్చే క్రమంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని అంటున్నారు. తద్వారా పులిచింతల ఎండిపోయిందని చెబుతున్నారు. ఇక ఈ పులిచింతల ప్రాజెక్టు పైన ఆధారపడి కృష్ణా డెల్టా లోని దాదాపు 15 లక్షల ఎకరాల వరి సాగుతుంది. ఇప్పుడు పిలిచింతల ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో... ఆ పంటలకు  నీళ్లు లేకుండా పోయాయి. ముఖ్యంగా గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు ద్వారానే వరి పంట సాగు అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఆసంగిలో ఆ పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: