•2 దశాబ్దాలుగా సాగు, త్రాగు నీటి కోసం వెలిగొండ ప్రజల ఎదురుచూపు..

•వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే మూడు జిల్లాలు 30 మండలాలు.. 16 లక్షల మంది రైతులకి ఊరట..

•రైతుల కష్టాలు తీర్చే వారే లేరా..

(వెలిగొండ ప్రాజెక్టు - ఇండియా హెరాల్డ్)

ప్రకాశం జిల్లా రైతాంగం దశాబ్దాల కాలంగా నీటి కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఎవరైనా నేతలు అధికారంలోకి వస్తే వెలిగొండ రిజర్వాయర్ నిర్మించి తమ కష్టాలు తీరుస్తారని ఎంతో ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి ఎంతమంది నాయకులు వచ్చినా సరే అప్పటికప్పుడు పాలన కొనసాగిస్తున్నారు కానీ ప్రజల కష్టాలను శాశ్వతంగా తీర్చాలనే యోచన మాత్రం ఎవరూ చేయడం లేదని అక్కడి ప్రజల పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది.. అయితే ఇదిలా ఉండగా 2004లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు.. ఆ తర్వాత ఆయన స్వర్గస్తులవడంతో ఆ ప్రాజెక్టు అక్కడికక్కడే మూత పడింది. ఇక తర్వాత అధికారంలోకి ఎన్నో పార్టీలు వచ్చినా.. ఏ ఒక్కరు కూడా ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి కూడా చూడలేదు.. ఇక దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆయన వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి..  పశ్చిమ ప్రాంత వాసులు వరప్రదాయనిగా పిలుచుకునే  వెలికొండ ప్రాజెక్ట్ రెండు టన్నెల్స్ ను గత రెండు నెలల క్రితం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే..


ఇకపోతే శ్రీశైలం బ్యాక్ వాటర్ ను తరలించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.. ఒకవేళ ఈ ప్రాజెక్టు గనుక పూర్తి అయితే ముఖ్యంగా మూడు జిల్లాలలో 30 మండలాలకు సాగునీరు అందడమే కాదు... పైగా 16 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు కూడా లభిస్తుంది. ప్రకాశం జిల్లాకు కృష్ణానది జలాలను తరలించి ..సాగు తాగునీటి సమస్యలు లేకుండా సస్యశ్యామలం చేయాలనే   ఉద్దేశంతో 1994లో వెలిగొండ ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేశారు. 1996 మార్చి 5 న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టుకు మొట్టమొదటిసారి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేశారు కానీ నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి.


2004లో అధికారంలోకి వచ్చిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరిట చేపట్టిన ప్రాజెక్టుల్లో భాగంగా వైఎస్సార్ మరోసారి ఈ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి.. పనులను ప్రారంభించారు. కృష్ణ వరదల సమయంలో వందల  టిఎంసిల నీరు సముద్రం పాలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి వరద జలాల వినియోగానికి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఆ నీటిని నిలువ చేసేందుకు నల్లమల కొండల మధ్యలో సుంకేసుల.. కాకర్ల ప్రాంతాల మధ్య ఆనకట్ట కట్టారు. ఈ రిజర్వాయర్ కి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా పేరు పెట్టారు.. కమ్యూనిస్టుగా పేరు పొందిన పూల సుబ్బయ్య ఈ ప్రాజెక్టు కోసం కష్టపడ్డారు .. ఈ నేపథ్యంలో నే వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ నాయకుల పేర్లు పెట్టకుండా పూల సుబ్బయ్య పేరు మీద గాని ప్రాజెక్టుకి పేరును పెట్టడం జరిగింది.

ఇకపోతే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు టన్నేల్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.. కానీ నీటి విడుదలకు ఇంకా నోచుకోలేదు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారు కానీ అసలు విషయం తెలియాలి అంటే జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే మరోవైపు ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదనే చెప్పాలి.. ఇక దాదాపు 20 సంవత్సరాలకు పైగా వెలిగొండ ప్రజలు నీరు లేక కన్నీటితో విలవిల్లాడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఈ వెలిగొండ ప్రజల కష్టాలు తీర్చి వెలిగొండను వెలిగేలా ఎవరు చేస్తారో అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: