ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ షర్మిల... మొన్నటి వరకు దుమ్ము లేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి... నాన రచ్చ చేశారు వైయస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ షర్మిలను ఎంతవరకు నమ్మరో తెలియదు కానీ సోషల్ మీడియాలో అలాగే టీవీలలో వైయస్ షర్మిల పేరు మాత్రం బాగా మారు మోగింది. కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేసి... జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించారు.

 వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును... ప్రతిరోజు ప్రచారంలో గుర్తు చేస్తూ... వైసిపి పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు వైయస్ షర్మిల. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి ఓటు వేయకండి అంటూ... తన తల్లి విజయమ్మ తో కూడా చెప్పించారు షర్మిల. అలాగే వైయస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీతను కూడా రంగంలోకి దింపారు. తన ప్రచారం కోసం అన్ని ఆస్త్రాలను షర్మిల వాడారు.

మరి కడప ఎంపీగా షర్మిల గెలుస్తారో లేదో కానీ... ఇలాంటి నేపథ్యంలో ఆమె పరువు మాత్రం కాంగ్రెస్ సీనియర్ లీడర్ రఘువీరారెడ్డి తీసేసారు. వైయస్ షర్మిల ప్రభావం ఏపీలో ఏమాత్రం లేదని చెప్పకనే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే దక్కించుకునే శక్తి ఉందని ఆయన వెల్లడించారు. షర్మిల ప్రభావం కనిపించాలంటే 2029 వరకు ఆగాల్సిందేనని  రఘువీరారెడ్డి వెల్లడించారు.

 అప్పటివరకు షర్మిల ప్రభావం ఎక్కడ కనిపించ బోధని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. అయితే కడప ఎంపీగా షర్మిల గెలిచే ఛాన్సులు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు. కడప నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందని... అది జరిగితేనే షర్మిల గెలుస్తుంది అన్నారు. లేకపోతే కష్టమే అన్నట్లుగా మాట్లాడారు రఘువీరారెడ్డి. దీంతో రఘువీరా రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో  హాట్ టాపిక్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: