ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే మరోసారి రావడం చాలా కష్టం. అలాంటి సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఏపీ ఎలక్షన్స్ లో ఈ 2024 ఎన్నికల్లో మాత్రం అధికారంలోకి వచ్చే పార్టీ ఏదైనా సరే, మళ్లీ 2029లో అధికారంలోకి వస్తుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయని వారు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో  వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారి చంద్రబాబు సీఎం అయితే రెండవసారి జగన్ సీఎం అయ్యారు. 

 ఈ తరుణంలో చంద్రబాబు కొన్ని అభివృద్ధి పనులు మొదలు పెడితే జగన్ వాటిని పూర్తి చేశారు.  జగన్ కూడా చాలా వరకు అభివృద్ధి పనులను తీసుకొచ్చారు. ఐదేళ్ల పాలనలో అవి పూర్తి కాలేకపోయాయి. ఈసారి సీఎం అయ్యే వ్యక్తి ఆ పనులన్నీటిని పూర్తిచేసే అవకాశం ఉంది. దీనివల్ల  ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుంది.  ఆ ప్రభావం 2029 ఎలక్షన్స్ లో తప్పక కలిసి వస్తుందని తెలియజేస్తున్నారు. మరి అభివృద్ధి పనులేంటి అనే వివరాలు చూద్దాం..ఈసారి గెలిచిన ఏ పార్టీకైనా సరే 2024 నుంచి 2029 మధ్య అన్ని సానుకూల ఫలితాలే ఉంటాయట. వచ్చే ఏ ప్రభుత్వమైనా సరే పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెడుతుంది ఈసారి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రభావం 5-6 జిల్లాలపై పడి పార్టీకి సానుకూలత పెరుగుతుంది.

ఇక రాజధాని సమస్య కూడా ఏదో ఒక కొలిక్కి వచ్చేలా ఈసారి గెలిచిన పార్టీ తీసుకువస్తుంది. ఉమ్మడి ఆస్తుల ఆస్తుల వివరాలు, నిధులన్నిటికీ ఒక సొల్యూషన్ మాత్రం దొరుకుతుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తవుతుంది. అంతేకాకుండా పోర్టులు, షిప్పింగ్, హార్బర్ల పనులు కూడా పూర్తవుతాయి. 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభానికి నోచుకుని, నిర్మాణాలు పూర్తవుతాయి. దీనివల్ల ఏపీకి సంపదతో పాటు, ఉద్యోగ అవకాశాలు పెరిగి, గెలిచిన  పార్టీకి సానుకూలత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ రాబోవు ఐదేళ్లలో తప్పనిసరిగా జరుగుతాయి. ఏ పార్టీ గెలిచినా వీటిపై ప్రత్యేకమైన దృష్టి మాత్రం పెడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని దక్కించుకునేది చంద్రబాబునాయుడా లేదంటే జగన్మోహన్ రెడ్డా అనేది జూన్ 4వ తేదీన బయటకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: