ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో... రోజుకు ఒక అంశాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కొంతమంది కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతుంటే... మరి కొంతమంది వైసిపి సర్కార్ మరోసారి ఏర్పాటు అవుతుందని అంటున్నారు. అయితే కూటమి అధికారంలోకి వస్తే... జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రెండు మంత్రి పదవులు వస్తాయని చెబుతున్నారు.

ఒకటి హోమ్ మినిస్టర్ అయితే మరొకటి డిప్యూటీ ముఖ్యమంత్రి అని చెబుతున్నారు. ఇక మరి..  నారా లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలా అయితే జనసైనికులు మాత్రం... పవన్ కళ్యాణ్ కు ఏపీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అంటున్నారు. ఇక తాజాగా కొంతమంది ఏపీలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని...  పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని చెబుతున్నారు. వైసీపీ, టీడీపీ పార్టీలకు తక్కువ సీట్లు రావడం వల్ల...ఏపీలో బీజేపీ కీ రోల్‌ ప్లే చేస్తుందని... చెబుతున్నారు. ఇలా ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది... అలాగే మంత్రి పదవులను  కూడా పంచుకుంటున్నారు.

వాస్తవం మాట్లాడుకుంటే... ఏపీలో హంగు ఏర్పడే పరిస్థితి లేదు. ఒకవేళ టైట్ పొజిషన్ వచ్చినా కూడా... జగన్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే చంద్రబాబు అయినా ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తారు. కానీ కొత్తగా బిజెపి ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడదు. వస్తే వైసిపి ప్రభుత్వం కచ్చితంగా ఏపీలో ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. లేదా కూటమి మాత్రం అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.

 ఇవేవీ కాకుండా బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. అందులోనూ పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చేస్తున్నారు. ఇదంతా కాలం గడుపుకునేందుకు...  కొంతమంది బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో వైసీపీ లేదా తెలుగుదేశం పార్టీలు మాత్రమే బలంగా ఉన్నాయని... ఈ రెండు పార్టీలే అధికారాన్ని మార్చుకుంటాయి తప్ప..  జాతీయ పార్టీలకు అవకాశాలు ఇవ్వబోవని... చెబుతున్నారు విశ్లేషకులు. ఈ ఫలితాలపై క్లారిటీ రావాలంటే మరో వారం రోజులు ఆగాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: