ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొకవైపు కుప్పంలో చంద్రబాబు.. అలాగే ఈయన కుమారుడు నారా లోకేష్ మంగళగిరి పరిస్థితి.. ఈ ముగ్గురి నేతలే కాదు.. హిందూపురంలో కూడా బాలయ్య ఈసారి గెలవగలరా అనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విషయమే హాట్ టాపిక్ గా మారుతోంది. పోలింగ్ సరలి చూసిన తర్వాత బాలకృష్ణ ఈసారి హ్యాట్రిక్ కొడతారా అనే డౌట్ కూడా కనిపిస్తోంది. లేదా మొదటిసారి అపజయాన్ని మూట కట్టుకుంటారా అనే డౌటు కూడా మొదలవుతోంది. ఈ విషయం మీదే రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది.
ఈనెల 13న అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి.. మరో కొద్ది రోజులలో ఓటింగ్ ఫలితాలు కూడా విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పుడు అసలు సిసలైన ఉత్కంఠ ఇప్పుడే మొదలయ్యింది. అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారు.. ఎవరు గెలవబోతున్నారు.. ఎవరు ఓడిపోబోతున్నారు.. ప్రస్తుతం ఇదే అంశం మీద రాష్ట్రంలో చాలా నియోజకవర్గలలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కేవలం కొన్ని నియోజకవర్గాల మీద ఎక్కువగా ఫోకస్ కనిపిస్తోంది.అలాంటి నియోజకవర్గాలలో హిందూపురం కూడా ఒకటి. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే టిడిపి పార్టీకి ఓటమన్నదే అసలు ఎరగలేదు.. మరొకటి ఏమిటంటే బాలయ్య ఎక్కడ మూడవసారి ఎమ్మెల్యేగా గెలవాలని ఆశపడుతున్నారు. టిడిపి పార్టీకి హిందూపురం కంచుకోటగా ఉన్నది. గతంలో కూడా నందమూరి కుటుంబం నుంచి సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ వంటి వారు కూడా గెలిచారు. గతంలో టిడిపి గుర్తు కనిపిస్తే చాలు ప్రజలు అభ్యర్థి ఎవరైనా సరే ఓటు వేసేవారు.. అయితే ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.


గతంలో ఎన్నడు లేనివిధంగా బాలయ్య ఈసారి తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నారట. వైసిపి పార్టీ మాత్రం పక్కాగా గురిపెట్టి మరి ఈ స్థానం పైన విజయం సాధించాలని అందుకే ఇక్కడ కురబ సామాజిక వర్గానికి చెందిన దీపికాను ఇక్కడ బరిలోకి దింపారు. బాలకృష్ణకు లేపాక్షి చిలమత్తూరు మంచి గ్రిప్ ఉన్నది. హిందూపురంలో ఈసారి ఎవరికీ మక్కువ చూపిందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. 2024 ఎన్నికల తీరును చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ చుట్టపు చూపుగా అప్పుడప్పుడు వస్తూపోతూ ఉంటారు. వైసిపి అభ్యర్థి కురవ దీపిక కొత్త అభ్యర్థి అయినప్పటికీ.. ఆమె భర్త మాత్రం పార్టీలో కీలకంగా ఉన్నారు. గతంలో హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీలో ఎన్నో విభేదాలు ఉన్నప్పటికీ.. వాటన్నిటిని సర్దు మునిగి అందరినీ కలిపి ఓటింగ్ ప్రక్రియకు పూర్తిగా విజయవంతంగా చేశారు. హిందూపురంలో రెడ్డి సామాజిక వర్గం మైనారిటీ ఓట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఓట్లన్నీ కూడా వైసీపీకి పడ్డట్టు సమాచారం. 2009లో 69.63 శాతం జరగక 2014లో 76.75 శాతం జరిగింది..2019 లో 77.64 శాతం.. 2024 లో 77.64 శాతం నమోదయింది. అయితే బాలకృష్ణ గ్రాఫ్ ప్రతిసారి పెరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ముస్లింస్ వైసీపీ వైపుగా మళ్ళినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ బాలయ్య ఓడితే హ్యాట్రిక్ గండి దీపికానే కొట్టిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: