ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వైరస్ తో ఈసీకి ఇన్ఫెక్షన్ వచ్చిందని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. ఫలితాలు వచ్చే ముందు తాత్కాలిక ఆనందాలకు మేము వెళ్లడం లేదని పేర్కొన్నారు. బెట్టింగ్ లో కోసం, సోషల్ మీడియా లో ప్రచారం కోసం మేము ప్రయత్నాలు చేయడం లేదన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. నార్త్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సౌత్ లో ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఇదే ఉద్దేశంతో మాట్లాడి ఉండవచ్చు అని మండిపడ్డారు. ఉద్యోగులంతా తమ వెనుకే ఉన్నారని పోస్టల్ బ్యాలెట్ కు లేనిపోని నిబంధనలు అడుగుతున్నారని నిప్పులు చెరిగారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. సీఈఓ నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చారని ఆగ్రహించారు. బీజేపీ తో చంద్రబాబు పొత్తు తర్వాత బాబు కి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని ఆరోపణలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.

మాచర్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. EVM ధ్వంసం వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పడం లేదని నిప్పులు చెరిగారు. మిగతా చోట్ల EVM ధ్వంసం వీడియో లు ఎందుకు బయట పెట్టలేదన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. అన్యాయం జరిగింది కాబట్టి రీ పోలింగ్ అడిగాము...టీడీపీ ఎందుకు రీ పోలింగ్ అడగలేదని ప్రశ్నించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.

మా కార్యకర్తలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు... ఎన్నికల కమిషన్... బాబు వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిందని చురకలు అంటించారు. బాధితులకు పార్టీ తరపున అండగా నిలుస్తామన్నారు.  అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆదుకుంటాం... వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే కేంద్రంలో ఉన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నట్లున్నాడని ఆగ్రహించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. సిఎస్ ను తప్పించాలని టార్గెట్ తో రెండు నెలలుగా ప్రయత్నం చేస్తున్నారు...
ఉగ్రవాది లాగా సిఎస్ పై దాడి చేస్తున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: