ఏపీలో ఎన్నికలు ముగిసిన రాజకీయ వేడి మాత్రం ఇంకా  తగ్గడంలేదు. ఈ ఎన్నికలలో ముఖ్యంగా పవన్ కల్యాణ్  కూటమికి కొండంత సపోర్ట్ ఇచ్చారు. ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య స్టిక్కర్ వార్ నడుస్తోంది.ఇక పిఠాపురం అయితే అందరి దృష్టిని ఆకర్షించింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఇక్కడి నుంచి పోటీకి దిగడమే దీనికి కారణం.పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసిందో…అప్పటి నుంచీ కూడా ట్రెండింగ్‌లో ఉన్న సెగ్మెంట్. అక్కడ ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో.. పోలింగ్‌ కూడా అంతే ఆసక్తిగా కూడా సాగింది. ఎన్నికల ఫలితాల ముందు అదికాస్త చాలా పీక్స్‌కు చేరుకుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు మా తాలుకా అంటే మా తాలుకా అని బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్‌ పేట్లకు బదులు మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని రేడియంతో స్టిక్కరింగ్‌ చేయిస్తున్నారు.రిజల్ట్స్ కు ముందే పిఠాపురంలో రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ ఫ్లెక్సీలతో హంగామా చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే అభిమానం పీక్స్‌కు చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలిచినట్లయింది. ఫలితాలు వెలువడే వరకు ఇరు పార్టీల కార్యకర్తలు మరింత రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.పిఠాపురంలో ఎవరు గెలిచినా మెజార్టీ అతి స్వల్పంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. వారం రోజుల్లో రిజల్ట్ రాబోతున్న దశలో అటు జనసేన, ఇటు వైసీపీ అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. తమ నాయకులే గెలిచేశారని తేల్చేస్తున్నారు.పిఠాపురంలో వంగ గీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి చేస్తానంటూ ఎన్నికల ప్రచారం చివరి రోజున పిఠాపురంలో నిర్వహించిన సభలో జగన్ హామీ ఇచ్చా రు.ఇతరులు ఎవరు గెలుస్తారనేది జూన్ 4వ తేదీన తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: