ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత కూడా.. అధికారం ఎవరు చేపడుతారనే విషయం పైన ఏ క్లారిటీ రాలేదు.. అధినేతలు మాత్రం ఎవరికి వారు మేమే వస్తామంటూ వైసిపి నేతలు టిడిపి నేతలు ఇద్దరు చెప్పుకుంటున్నారు. అయితే ఇందుకు గల కారణం ఓటింగ్ శాతం పెరగడమే అని కొందరు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు వృద్ధులు వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేశారని చెబుతున్నారు.. జగన్ ఐదేళ్ల పాలనకి ప్రజలు మంచి మద్దతు ఇస్తున్నారని కూడా వైసిపి నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే టిడిపి నేతలు ఈ విషయాన్ని ఖండిస్తూ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు.


ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఓటింగ్ శాతం కూటమికి ఎక్కువగా పడినట్లు తెలుస్తున్నది. అలాగే వీరితోపాటు వీరి యొక్క కుటుంబ సభ్యులు ఓటింగ్ కూడా కూటమికే పడిందని తెలియజేస్తున్నారు టిడిపి నేతలు. అలాగే ఆంధ్రప్రదేశ్లో మేధావులు, చదువుకున్న వారు, ఇతరత్రా ప్రైవేటు ఉద్యోగులు వైసిపి పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సామాజిక వర్గాలపరంగా చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం కాపు వర్గానికి మెజారిటీ ఓట్లు ఉన్నవి. ఈ మెజారిటీ ఓట్లలో 60 శాతం కూటమికాని 40 శాతం వైసీపీకి పడ్డాయని తెలియజేస్తున్నారు.


మరొకవైపు బీసీలలో వైసీపీకి టిడిపికి మంచిపట్టునప్పటికీ వైసీపీకి పడ్డాయని వార్తలు వినిపిస్తున్నాయి  అలాగే ఎస్సీ, ఎస్టీ , మైనారిటి లో కూడా ఎక్కువ ఓట్లు వైసీపీకి పడ్డాయని చెప్పుకుంటున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రెండు వైపులా లాజిక్ తోనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అటు టీడీపి ,బిజెపి, జనసేన మూకుమ్మడిగా ఒక్కటై వైసిపిని ఎదుర్కోవడానికి చూశారు.. మరి ఇన్ని వ్యతిరేకతల మధ్య జగన్ ఒంటరి పోరాటంతో విక్టరీ సాధిస్తే.. రాబోయే రోజుల్లో జగన్ కి ఎవరు సాటి రారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రజలకు మంచి చేస్తే ప్రజలే తమని రాజును చేస్తారని కూడా చప్పడానికి ఇదొక ఉదాహరణగా ఉంటుంది. ఒకవేళ కూటమి గెలిచినా కూడా రాబోయే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే.. అన్ని పొత్తుల మధ్య గెలవడం పెద్ద సంగతి కాదని కూడా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: