దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆరు విడతల్లో పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయ్యాయి. మరో విడత బాకీ ఉంది. జూన్ మొదటి వారంలో చివరి విడత పోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలో... ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని బిజెపి నేతలు నిత్యం చెపుతున్నారు.

ఇటు ఇండియన్ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొంతమంది అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైసిపి పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఎంపీ సీట్లు ఎలాగైనా ఎక్కువగా గెలుస్తామని వైసిపి భావిస్తోంది. కొన్ని సర్వేలలో 20 సీట్ల వరకు వైసిపి గెలవబోతుందని రిపోర్ట్స్ వచ్చాయి. అయితే కేంద్రంలో.. కాంగ్రెస్ కూటమి, లేదా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రాంతీయ పార్టీల సహకారం అవసరం వస్తే.. జగన్మోహన్ రెడ్డి కీలకము కానున్నారు.

అయితే అలాంటి సమయంలో... ఎన్డీఏ కూటమికి కాకుండా.. ఇండియా కూటమికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చేందుకు... నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఎందుకంటే గత ఐదు సంవత్సరాలలో ఎన్డీఏ కూటమికి జగన్ మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయి. అన్ని బిల్లులకు వైసీపీ పార్టీ సపోర్ట్ చేసింది. కానీ ఎన్నికలు వచ్చేసరికి...  తమ ప్రత్యర్థి అయినా తెలుగుదేశం పార్టీతో బిజెపి జత కట్టింది.

 దీంతో జగన్మోహన్ రెడ్డి... బిజెపి పై చాలా సీరియస్ గా ఉన్నారట.అందుకే కేంద్రంలో... ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. ప్రాంతీయ పార్టీల అవసరం వస్తే... ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇచ్చేందుకు వైసిపి సిద్ధంగా ఉందట. వాస్తవానికి వైసిపి, కాంగ్రెస్ పార్టీలకు పడదు. కానీ ప్రధాని మోడీ, అమిత్ షాలను దెబ్బకొట్టేందుకు... జగన్మోహన్ రెడ్డి ఇలా ముందుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరి కేంద్రంలో జగన్ మోహన్ రెడ్డి చక్రం తిప్పాలంటే... ఏపీలో ఎంపీ సీట్లు ఎక్కువగా గెలవడమే కాకుండా...అధికారంలోకి కూడా రావాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: