సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొల్పింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ పరిస్థితిపై  ఆసక్తికర చర్చ ఇప్పటికే మొదలైంది. చీరాలలో వైసీపీకి టిడిపికి మధ్య బిగ్ ఫైట్ అని భావించిన సమయంలో ఆమంచి రూపంలో ట్రయాంగిల్ ఫైట్ తెరపైకి వచ్చింది. త్రిముఖ పోటీతో చీరాల రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే ఈ త్రిముఖ పోరు ఎవరి కొంపముంచుతుందో అనే ఆసక్తికరమైన చర్చ చీరాలలో సాగుతుంది.వైసిపి నుండి కరణం వెంకటేష్ టిడిపి నుండి ఎంఎం కొండయ్య కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బరిలో దిగారు. ఆమంచి 2009లో మొదటిసారిగా కాంగ్రెస్ తరపున నిలబడి గెలిచారు అలాగే 2014 నవోదయం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తరువాత టిడిపిలో చేరారు .

కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ ఎన్నికలలో ఓటమిని చవిచూశారు. అయితే ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి వైసీపీకి తీవ్ర ఇరకాటంలో పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రధానంగా వైసిపి అభ్యర్థి కరణం వెంకటేష్ కు చెక్ పెట్టేందుకే ఆమంచి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారని జోరుగా ప్రచారం జరుగుతుంది.ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ ఒక బలమైన రాజకీయ నాయకుడు అయితే ఆయన తన రాజకీయ జీవితం కోసం ప్రతి ఐదు సంవత్సరానీకొకసారి పార్టీ మారక తప్పడం లేదు. వైసీపీ తరఫున పర్చూరు ఇన్చార్జిగా ఉన్న ఆమంచి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చీరాల ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆమంచికి వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో ఆయన కాంగ్రెస్లో చేరారు.అయితే ప్రస్తుతం అక్కడ ఆ మంచి పోటీతో చీరాలలో లెక్క మారిపోతుంది అన్న చర్చ కూడా వినపడుతుంది. ఆమంచికు తన సొంత సామాజిక వర్గం అయినా కాపులు అలాగే ఎస్సీ, మత్స్యకారులు, పద్మశాలీలు ఆయన వెంట ఉన్నారని చర్చ కూడా జరుగుతుంది. అయితే ఆమంచి యొక్క ఎంట్రీ అనేది వైసీపీ, టీడీపీ లో ఎవరి కొంపముంచ బో తుందా అనే ప్రధాన చర్చ కొనసాగుతుంది. ఆమంచి ఎవరిని ముంచారో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: