ఆంధ్రప్రదేశ్లోని చాలా నియోజకవర్గాలలో సెంటిమెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని సింగనమల నియోజకవర్గం లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని అలాగే పెనుగొండ నియోజకవర్గం లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ఓడిపోతుందని సెంటిమెంటు గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. మరి దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనావాయితీ ఈ ఎన్నికలలో కూడా కొనసాగుతుందా అనే విషయం ఇప్పుడు రాజకీయ నాయకులకే అంతు చిక్కడం లేదు. మరి సింగనమల నియోజవర్గంలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం.


ఎస్సీ రిజర్వుడు స్థానంలో సింగనమల నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ ఉన్నది. ఇదే సాంప్రదాయంగా కొనసాగుతోందట. మరి ఈసారి ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనే చర్చ ఇప్పుడు కొనసాగుతోంది. గత ఎన్నికలలో టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి వైసిపి అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి 46,242 ఓట్ల మెజారిటీతో గెలిచింది. దీంతో గతంలో 151 ఒక్క స్థానాలలో వైసిపి సీట్లను గెలుచుకుంది. అంతకుముందు 2014 ఎన్నికలలో టిడిపి నుంచి యామిని బాల వైసీపీ అభ్యర్థిగా జొన్నలగడ్డ పద్మావతి పోటీపడ్డారు అప్పుడు టిడిపికి చెందిన యామిని బాల 4,584 ఓట్లతో గెలిచింది. అప్పుడు టిడిపి పార్టీని అధికారంలోకి వచ్చింది.


2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా సైలజానాథ్ పోటీ చేయగా.. టిడిపి అభ్యర్థిగా శమంతకమని పోటీ చేశారు.. అప్పట్లో 3,176 ఓట్ల ఆదిక్యంతో శైలజనాథ్ గెలిచారు. ఆ తర్వాత రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని హవా కొనసాగింది. 2004లో కాంగ్రెస్, టిడిపి హొరాఫోరిగా పోటీ పడగా.. అప్పుడు కూడా 8,686 ఓట్ల తేడాతో శైలజనాథ్ గెలిచారు. 1999లో టిడిపి అభ్యర్థిగా కొత్తపల్లి జయరాం, కాంగ్రెస్ నుంచి సాయిరాం పోటీ చేయగా.. జయరాం గెలిచి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు.


1989లో కాంగ్రెస్ నుంచి పి శమంతకమని పోటీ చేసి గెలవగా అప్పుడు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో వచ్చింది. ఇక 2024 లో వస్తే వైసిపి అభ్యర్థి వీరాంజనేయులు.. టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి పోటీ పడగా.. ప్రధాన పోటీ టిడిపి వైసీల మధ్య జరుగుతోంది. చివరికి ఎవరికి వారు గెలుపు కోసం ప్రయత్నించారు. సింగనమల నియోజవర్గంలో 2,47,373 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,22,927 నంది పురుషులు..1,24,217 మంది స్త్రీలు ఉన్నారు.. ఈసారి పోలింగ్ అయిన ఓట్ల సంఖ్య 2,05,068  మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.. మొత్తం మీద 82.898 శాతం పోలింగ్ అయింది.. గత ఎన్నికలలో 84% పైగా పోలింగ్ కాగా.. శింగనమల నియోజకవర్గంలో గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, ఎల్లనూరు  మండలాలు ఉన్నాయి.. పుట్లూరు ఎల్లనూరు మండలాలలో వైసీపీకి ఎక్కువ ఆధిక్యత ఉందని టాక్ వినిపిస్తోంది. నార్పల మండలంలో మెజారిటీ కూడా వైసిపి పార్టీకే ఉందంటూ టాక్ వినిపిస్తోంది. సింగనమల నార్పల, గార్లదిన్నె మండలాలలో మాకే ఆదిత్య ఉంటుందంటూ టిడిపి నేతలు తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి ఉత్కంఠ బరిలో  సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా.. లేదా ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: