- అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి త‌ప్ప‌నిస‌రి
- ప్రాంతాన్ని బ‌ట్టి ప్రాజెక్టుల ఏర్పాటుతో తిరుగే ఉండ‌దు
- విద్య‌, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ఉండాల్సిందే..!

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఎడ్యుకేష‌న్ హ‌బ్‌గా మారిస్తే.. తిరుగులేదు :

ఏపీని ఎడ్యుకేష‌న్ హ‌బ్‌గా మార్చేందుకు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుత జ‌గ‌న్ పాల‌న‌లో  నాడు-నేడు కార్య‌క్ర‌మం కింద‌.. పాఠ‌శాల‌ల‌ను తీర్చిదిద్దారు. ఈ నేప‌థ్యంలో వీటిని కొన‌సాగిస్తూ.. మ‌రింత అభివృద్ది చేస్తే.. రాష్ట్రం ఎడ్యుకేష‌న్ హ‌బ్ గామారేందుకు ఎంతో అవ‌కాశం ఉంది.


న‌వ‌న‌గ‌రాలు నిర్మించాల్సిందే :

గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేప‌ట్టిన అమ‌రావ‌తి ప్రాజెక్టులో భాగంగా రాజ‌ధాని ప్రాంతం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. దీనిలో బాగంగా తీసుకువ‌చ్చిన న‌వ‌న‌గ‌రాల నిర్మాణం అయితే.. కీల‌క‌మ‌నే చెప్పాలి. దీనిని పూర్తి చేయ‌డం ద్వారా.. దేశంలో మేటిన‌గ‌రంగా అమ‌రావ‌తిని పూర్తి చేయ‌డం ద్వారా.. విద, ఉపాధి, ప‌రిశ్ర‌మ‌లకు కేంద్రంగా దీనిని తీర్చిదిద్దే అవ‌కాశం ఉంది.


కొబ్బ‌రి బోర్డు ఏర్ప‌టుతో కోన‌సీమ‌కు కాసుల వ‌ర్షం..

కోన‌సీమ అంటేనే కొబ్బ‌రినేల‌. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన‌ట్టు కొబ్బ‌రి బోర్డును ఏర్పాటు చేస్తే.. ఈ రెండు ఉభ‌య గోదావ‌రి ఉమ్మ‌డి జిల్లాలు కూడా.. దేశంలోనే నెంబ‌ర్ 1 స్థానంలోకి చేరుకుంటాయ‌నే అభిప్రాయం ఉంది. ఇది నిజం కూడా. బోర్డు ఏర్పాటుతో కొబ్బ‌రి ఉత్ప‌త్తుల‌ను పెంచ‌డం ద్వారా కార్పెట్ ప‌రిశ్ర‌మ‌కు కేంద్రంగా ఈ రెండు జిల్లాల‌ను తీర్చి దిద్దే చాన్స్ ఉంది.


వంశ‌ధార నీటితో ఉత్త‌రాంధ్ర మాగాణి :

ఒడిసారాష్ట్రంతో వివాదం ఉన్న వంశ‌ధార న‌దీ జ‌లాల విష‌యంలో ఏపీ ప‌రిష్క‌రించుకునే దిశ‌గా అడుగులు వేస్తే.. ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాలు కూడా.. మాగాణిగా మారుతాయ‌న‌డంలో సందేహం లేదు. అయితే.. ఆ దిశ‌గా కొంత క‌స‌ర‌త్తు జ‌ర‌గాల్సి ఉంది. గ‌తంలో జగ‌న్ స్వ‌యంగా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ను క‌లుసుకున్నారు. త‌ర్వాత‌.. ఇది ముందుకు సాగ‌లేదు. అదేవిధంగా కొఠియా గ్రామాల స‌మ‌స్య‌లు కూడాప‌రిష్క‌రిస్తే.. ఉత్త‌రాంధ్ర‌లో స‌మ‌స్య‌ల‌కు దాదాపు చెక్ పెట్టిన‌ట్టే అవుతుంది. కిడ్నీ స‌మ‌స్య‌కు కూడా నీటి ద్వారా ప‌రిష్కారంచూపించిన‌ట్టు అవుతుంది.


తీర ప్రాంత అభివృద్ది-ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుతో ఆ జిల్లాలు సేఫ్ :

నెల్లూరు-ప్ర‌కాశం జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, అభివృద్ది కి కీల‌క‌మైన ప్రాధాన్యం తీర‌ప్రాంత డెవ‌ల‌ప్‌మెంట్ పైనే ఉంది. ఈ దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కారు మంచి అడుగులు వేసింది. అయితే.. రేపు ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా.. దీనిని కొన‌సాగిస్తే.. మేలు ఖ‌చ్చితంగా జ‌రుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.


రాయ‌ల‌సీమ క‌రువుకు ఇలా చెక్ :

రాష్ట్రంలో క‌రువు జిల్లాలు అన‌గానే గుర్తుకు వ‌చ్చేవి అనంత‌పురం, క‌ర్నూలు, క‌డ‌ప‌, న‌దుల అనుసంధానంతో ఈ జిల్లాల్లోమార్పును ఖ‌చ్చితంగా తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే.. దీనికి సంక‌ల్పం చెప్పుకొన్నంత ఈజీకాదు. ఖ‌ర్చు కూడా ఇబ్బడి ముబ్బ‌డిగానే ఉంది. కానీ, ప్ర‌య‌త్నం చేస్తే.. రాయ‌ల సీమ క‌రువుకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.

పైన చెప్పిన ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తే ఆంధ్రోడు దేశంలోనే నెంబ‌ర్ 1 అవుతాడ‌న‌డంలో ఎలాంటి సందేహం అయితే అక్క‌ర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: